తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా రెడీ?

Publish Date:Aug 15, 2023

Advertisement

చూస్తూ ఉండగానే ఈ ఏడాది కాలంలో రెండు భాగాలు పూర్తయి మరో భాగమే మిగిలి ఉంది. ఆగస్టు కూడా పూర్తవుతుండగా.. ఇక ఏడాదిలో మిగిలింది మరో నాలుగు నెలలే. ఈ నాలుగు నెలలు దాటితే ఏ క్షణమైనా ఏపీలో ఎన్నికల నగారా మోగడం ఖాయం. ఏడాది మారిందంటే ఎన్నికల కౌండ్ డౌన్ మొదలైనట్లే భావించాలి. అందుకే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. ఇప్పటికే వచ్చిన రెండు విడతల ఫలితాల ఆధారంగా కొందరికి క్లాసులు కూడా పీకిన జగన్.. త్వరలో రాబోతున్న తుది ఫలితాల ఆధారంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.    అభ్యర్థుల ఎంపిక  విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం   దూకుడుగా కనిపిస్తున్నది.

ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా లభిస్తున్న ప్రజాదరణ.     తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు జనం పెద్ద సంఖ్యలో హాజరౌతుండటం, వారి ప్రసంగాలకు విశేష స్పందన లభిస్తుండటం తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు,  విజయం సాధించే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది. తాజాగా తొలి విడత సర్వే నివేదికలు చంద్రబాబు చేతికి అందాయి. ఆ సర్వే ఫలితాల ఆధారంగా మొదటి విడత జాబితా సిద్ధం అవుతున్నది.

 ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వారి పని తీరుపై సర్వేల ఫలితాల ఆధారంగా ఈ జాబితా ఉంటుందంటున్నారు.  ఇక సిట్టింగులలో కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న నేతలకు క్లాస్ పీకనున్న చంద్రబాబు, రెండో జాబితా సమయానికి కూడా మార్పు లేకపోతే టికెట్లు కష్టమేనని వారికి తెగేసి చెప్పనున్నారని అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొత్తం 50 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. అది కూడా దసరా నాటికే ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ముందుగా తొలి జాబితా  ప్రకటించి వైసీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో తెలుగుదేశం   ఉన్నట్లు తెలుస్తున్నది.

 అయితే, టీడీపీ అభ్యర్థుల జాబితా అనగానే ముందుగా గుర్తొచ్చేది పొత్తుల పరిస్థితి ఏంటి అన్నదే. అన్నీ కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతానికి అయితే, రెండు వైపుల నుండి పొత్తుల వ్యవహారంపై సస్పెన్సే కొనసాగుతోంది. అయితే ఎన్నికల సమయానికి పొత్తులు పొడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

మరోవైపు పొత్తులు ఖరారు కాకుండానే తాను తప్పక పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తు అంటే కొన్ని స్థానాలను తెలుగుదేశం  వదులుకోవాలి. ఇప్పటికే జనసేన కొన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా.. మరికొన్నింటికిపై ఖర్చీఫ్ వేసి ఉంది. ఈ క్రమంలో ఇవి కాకుండా సేఫ్ సైడ్ ఉన్న స్థానాలను   ప్రకటించి.. ఇటు వైసీపీ, అటు జనసేనలపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని కూడా తెలుగుదేశం పరిశీలిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తొలి జాబితాలో ఉండే పేర్లేవి, పొత్తుల పరిస్థితి ఏమిటి?  అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. చూడాలి మరి తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన తరువాతైనా పొత్తులపై క్లారిటీ వస్తుందేమో.

By
en-us Political News

  
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.