సీమలో తెలుగుదేశం కూటమి భేష్.. మరి వైసీపీయో?

Publish Date:Aug 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి, సంక్షేమాలను జోడుద్దులుగా సమానంగా అమలు చేస్తూ ప్రజాదరణ పెంచుకుంటోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. 

వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.  కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా, కాకుండా, అభివృద్ధి కేంద్రీకృత పాలిటిక్స్ తో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.  వైసీపీకి పెట్టని కోట లాంటి రాయలసీమలో  ప్రస్తుతం  ప్రగతి వెలుగులు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా మారుతున్నాయి.  తిరుపతి జిల్లాలో  శ్రీ సిటీని  విస్తరించడం, అనంతపురం జిల్లాలో తయారీ రంగ పరిశ్రమలను  ప్రోత్సహించడం,  కడప మరియు కర్నూలు జిల్లాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా సీమను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తోంది చంద్రబాబు సర్కార్.  ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా  స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది సీమలో తెలుగుదేశం కూటమి పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలతను పెంచుతోంది. అదే సమయంలో..  వైసీపీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాయలసీమలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి  తిరుగులేని పట్టు ఉండేది.  తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉన్నప్పటికీ,  మొత్తంగా  సీమలో వైసీపీదే అధ్యప్యం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి  అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి రాజకీయాలు కాకుండా అభివృద్ధిని మెయిన్ అజెండాగా తీసుకుని ముందుకు సాగింది.   రాజకీయంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్న పరిస్థితి.  

AP Coalition Government, Rayalaseema Development Strategy,  Chandrababu Naidu Political Strategy, Telugu One  

By
en-us Political News

  
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
ఎమ్మెల్సీగా వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 20) ప్రమాణ స్వీకారంచేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు వర్ల రామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.