పదవులు పట్టుకొని వేలాడటం సరికాదు: కోమటిరెడ్డి
Publish Date:Oct 25, 2011
Advertisement
హైదరాబాద్: తెలంగాణ నేతలు పదవులు వదిలి గంటసేపు కూడా ఉండలేరన్న సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను తెలంగాణ ప్రజాప్రతినిధులు నిజం చేస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోటి నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లిలోని టిఎన్జీవో భవనంలో ఏర్పాటైన ఉద్యోగుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. పదవులు వదిలి ఉండలేరని సీమాంధ్ర నేతలు అంటున్నప్పటికీ నేతలు పదవులు పట్టుకొని వేలాడటం సరికాదన్నారు. ఉద్యోగులను చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిన తనకు పార్టీని వదలటం ఏమంత కష్టం కాదన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వనని చెప్పిన మరుక్షణమే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు.
ఉద్యోగులకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు. ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం జరిగిన సకల జనుల సమ్మెను చూపి ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ఉద్యమాన్ని ఉద్యమంగానే చూడాలని హితవు పలికారు. నవంబర్ మొదటి తారీఖున లక్ష మందితో తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తానని అయితే తన దీక్షతోనే కేంద్రం కదులుతుందన్న నమ్మకం లేదన్నారు. పదవులు వదిలితేనే తెలంగాణ సాధ్యమన్నారు. నవంబరు మొదటి వారంలోగా తేల్చకుంటే పార్టీ వీడతానన్నారు.
http://www.teluguone.com/news/content/telenjana-ministers-24-7905.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





