Publish Date:Jul 12, 2025
అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణహత్యకు గురయ్యాడు. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన చిప్పలపల్లి రవీందర్ ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా అసెంబ్లీ ప్రాంగణం లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో నివశిస్తున్నారు.ఆయన కుమారుడు విద్యాసాగర్ (28) మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ కంపెనీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. విద్యాసాగర్ గతం లో రెండు సార్లు స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లి వచ్చాడు. అయితే మూడో సారి ఒంటరిగా వెళ్లాడు.
ఈ నెల 4న మోత్కూరు వచ్చి తాతను చూసి.. ఆ తరువాత 6వ తేదీన అరుణాచలం బయలుదేరి వెళ్లాడు. అరుణాచలంలో ఆలయ గిరిప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో అక్కడకు వెళ్లిన విద్యాసాగర్ ఈనెల 8న రాత్రి వేళ గిరిప్రదర్శన చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి గొంతు కోశారు. రాత్రంతా కొన ఊపిరితో రోడ్డుపైనే పడి ఉన్న విద్యాసాగర్ ను 9వ తేదీ ఉదయం పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ మేరకు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అరుణాచలం వెల్లారు. పోస్టుమార్టం తరువాత విద్యాసాగర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-youth-ravinder-murderd-in-arunachalam-25-201848.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు