కేసీఆర్? హూ ఈజ్ కేసీఆర్?

Publish Date:Jun 24, 2024

Advertisement

ఒక టీవీ డాన్స్ ప్రోగ్రామ్‌లో ఓ డాన్సర్... ‘‘దుర్గారావ్? హు ఈజ్ దుర్గారావ్?’’ అన్నట్టుగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ‘‘కేసీఆర్? హు ఈజ్ కేసీఆర్?’’ అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారణం యువతరం ఆత్మహత్యలు చేసుకోవడం అయినప్పటికీ, కేసీఆర్ ఆ ఘనతను తన అకౌంట్లో వేసుకోవడానికి ప్రతిసారీ ప్రయత్నిస్తూ వుంటారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని ఆయన చెప్పుకుంటూ వుంటారు. అయితే ఆయన చేసింది నిరాహారదీక్షే కాదని, ఫ్లూయిడ్స్ దీక్ష అని అందరికీ తెలిసిన విషయమే.. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని తెలంగాణ బిడ్డలే చెబుతూ వుంటారు. మరి అబద్ధాలు చెప్పారో, మభ్యపెట్టారో.. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. పది సంవత్సరాలపాటు తెలంగాణని కేసీఆర్ మహారాజులాగా ఏలారు. తెలంగాణకు ఏం చేశారో ఏమోగానీ, ఆయన కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగా అభివృద్ధి  చెందారు. 

పది సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారు. ఈసారి ఆయన పార్టీని దారుణంగా ఓడించారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన కేసీఆర్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇప్పటి వరకూ అనుసరించిన మహారాజుల ధోరణినే అనుసరిస్తున్నారు. ప్రస్తుతం వున్న వాతావరణాన్ని గమనిస్తే, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గానీ, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం గానీ కనిపించడం లేదు. ఎందుకంటే, బీజేపీ రాష్ట్రంలో రెండో స్థానంలోకి వచ్చేసింది. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ తెచ్చింది మేమే అని డబ్బా కొట్టుకునే బీఆర్ఎస్ మాత్రం సున్నా ఫలితాలు సాధించింది.  కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ గానీ తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతని కోల్పోయారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం.

ఒక్క మాటలో చెప్పాలంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు మానసికంగా దూరం అయిపోయింది. ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్ జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నారు. ఆ ఘటనని తెలంగాణ ప్రజలు లైట్‌గా తీసుకున్నారు. కేసీఆర్ తుంటి నిజంగానే విరిగిందో లేదోగానీ, ఇదంతా ఒక డ్రామా అని తెలంగాణ ప్రజలు భావించారు. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు కేసీఆర్‌కి జలుబు చేస్తే, తెలంగాణలో ఒక వర్గం ప్రజలకి తుమ్ములు వచ్చేవి. అధికారం పోయిన తర్వాత ఆ వర్గం ప్రజలు కూడా కేసీఆర్‌ని పట్టించుకోలేదు. ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మూడు నెలలకు పైగా తీహార్ జైల్లో వుంటే, పాపం అన్న ప్రజలే లేరు. అడపాదడపా కేటీఆరో, హరీష్ రావో తప్ప స్పందించినవారే లేరు. ప్రజా సంఘాల వారుగానీ, గతంలో కవితతో కలసి బతుకమ్మ ఆడిన మహిళా సంఘాలవారుగానీ పాపం అన్న పాపాన పోలేదు.

పార్లమెంట్ ఎన్నికలలో అయినా బీఆర్ఎస్ కోలుకుని వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కానీ బీఆర్ఎన్‌ని ప్రజలు మరచిపోయారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్ర చేసి హడావిడి చేసినా, రైతుల కోసం పోరాటం అంటూ సందడి చేసినా జనం పట్టించుకోలేదు. ఇదంతా కేసీఆర్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న హడావిడే అని గ్రహించినట్టున్నారు. అందుకే  సున్నా సీట్లతో సత్కారం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ గానీ, ఆయన కుటుంబం గానీ ప్రజా సమస్యల గురించి స్పందించిన దాఖలాలే లేవు. కేసీఆర్ అయితే ఎప్పటిలాగానే తన ఫామ్ హౌస్‌లో రెస్టు తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి పార్టీని గానీ, ఇలాంటి నాయకులను గానీ, తెలంగాణ ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? కేసీఆర్ గానీ, కేసీఆర్ కుటుంబ నాయకులు గానీ ఇదే ధోరణిలో కొనసాగితే కేసీఆర్‌ని కూడా జనం మరచిపోతారు అనడం ఎలాంటి సందేహం అవసరం లేదు. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.