Publish Date:Aug 26, 2024
అతడు చట్ట సభకు అధిపతి. అయితేనేం హ్యాకర్లకు అవన్నీ పట్టవు. శాసనాలు తయారయ్యే అసెంబ్లీ స్పీకర్ ట్వీట్ హ్యాక్ కావడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవలి కాలంలో ప్రముఖుల ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు హ్యాక్ కావడం ఎక్కువవుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులు హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎక్స్ ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిన సమయంలో ఆ ఖాతాలో కొన్ని వీడియోలను, పోస్టులను హ్యాకర్లు పెట్టారు. ఈ విషయాన్ని గడ్డం ప్రసాద్ తెలిపారు.
"సూచన... ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ ఖాతా కొంత సమయం హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని సెట్ చేశారు. నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు, నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను" అని గడ్డ ప్రసాద్ ట్వీట్ చేశారు. స్పీకర్ ఖాతాను హ్యాక్ చేసిన నిందితులను సైబర్ క్రైం నిపుణులు పట్టుకుంటారో వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-speaker-who-got-hacked-25-183621.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.