భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి

Publish Date:Jul 30, 2026

Advertisement

 

ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

గురువారం రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో వర్షాల పరిస్థితిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉండాలని సూచించారు.

వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.

కాగా, నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 30 శాతం మేర ఉన్న వర్షపాతం లోటు, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గణనీయంగా తగ్గి దాదాపు సాధారణ స్థాయికి చేరుకుందని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జూలై 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Telangana rains, Hyderabad Meteorological Center, Red Alert, Adilabad rains, Severe Cyclone, Telangana Rains, Telangana Weather Update, IMD, Minister Ponguleti Srinivasa Reddy 
 

By
en-us Political News

  
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.