నాలుక్కే దిక్కు లేదు ..24 ఎక్కడ?.. రైతుల విద్యుత్ కష్టాలు

Publish Date:Feb 11, 2023

Advertisement

తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునే గొప్పల్లో 24 /7 ఉచిత విద్యుత్ ఒకటి.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులు ఉచిత విధ్యత్ ఇస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు అధికార పార్టీ నాయకులందరూ ప్రతి రోజు చెపుతూనే ఉంటారు. అలాగే ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ ఎజెండాలో ఫ్రీ పవర్ ఒక మెయిన్ ఫ్లాంక్’ గా వుంది. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులందరికీ, రోజుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. అంతే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు మనసు లేక కానీ, లేదంటే ఆదేమంత పెద్ద కష్టం కాదని, ఎక్కడికెళితే అక్కడ చెప్పిన లెక్కలే పదే పదే  ఎకరుప్వు పెడుతున్నారు. తాజాగా నాందేడ్ సభలోనూ కేసీఆర్’ కేంద్రంలో  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, దేశంలోని రైతు లందరికీ ఉచిత్ అవిధ్యుత్ ఇస్తామని మరోమారు వగదనం చేశారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’ తీరు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్లు ఉందని అంటున్నారు. 

రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది నిజం, కానీ, 24 గంటలు ఇస్తున్నామని చెప్పుకోవడం ఏదైతే వుందో, అది అసత్యం. సత్య దూరమైన విషయమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలే కాదు, టీస్ జెన్కో, ట్రాన్స్కో సిఎండీ ప్రభాకర రావు కూడా అదే చెప్పారు. ఇప్పుడే కాదు, ఎప్పడు కూడా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక రెండు మూడు రోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, 24 గంటలు ఉచిత విద్యుత్ తవడం లేదనే సభ్యులు, ఎలక్ట్రిక్’ తీగలు పట్టుకోవాలని ఇంకెవరో మంత్రి అన్న మాటలను ఉటంకిస్తూ ప్రతిపక్ష సభ్యులను ఎగతాళి చేశారు. మరోవంక రైతులు ఎదుర్కుంటున్న విద్యుత్ కష్టాలపై చర్చించాలని కోరుతూ, కాంగ్రెస్ సభ్యులు ఇచిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. కాంగ్రెస్ సభ్యులు చేసేది లేక, సభనున్కిఉ వాకౌట్’ చేసి మీడియాకు మొరపెట్టుకున్నారు.  

ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి “24 గంటల ఉచిత విద్యుత్‌ కేవలం ఊత పదమైంది. కనీసం 13 గంటలు విద్యుత్‌ కూడా ఇవ్వడం లేదు”  అని అన్నారు. నిజం, జీవన రెడ్డి అన్నట్లుగా, రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు కాదు, కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండడం లేదని, రోడ్డెక్కిన రైతులే చెపుతున్నారు. ఈ రోజుకు ఈరోజు నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. నకిరేకల్, నల్లగొండ, నాగర్జునసాగర్, తిప్పర్తి సహ పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న (గురువారం) రాత్రి నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించగా.. ఈరోజు  (శుక్రవారం)తిప్పార్తి లో ధర్నా చేపట్టారు. వ్యవసాయ బోరు బావులకు నాలుగు గంటలు కూడా కరెంటు రావడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

అలాగే, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బండలింగాపూర్ గేటు వద్ద వందలాది మంది రైతులు నేషనల్ హైవే 63పై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..‘‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ నాలుగైదు గంటలకు మించి ఇవ్వడం లేదు. కరెంటు కోతలతో  వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

అలాగే,నిన్న నిర్మల్– భైంసా రోడ్డుపై కాంగ్రెస్ నేతలతో కలిసి రైతులు రాస్తారోకో చేశారు. సర్కార్ కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని, ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట సబ్స్టేషన్ఎదుట రైతులు ధర్నా చేశారు. కరెంటు లేక ట్లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్5 గంటలకు మించి రావడం లేదు. అది కూడా ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక బావుల వద్దే పడిగాపులు కాస్తున్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో రైతులు సబ్స్టేషన్ను ముట్టడించారు. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆందోళన చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మాక్లూర్మండలంలోని దాస్ నగర్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. కరెంటు కోతలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాలో కరెంట్‌‌‌‌‌‌‌‌ సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఓ రైతు సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు సబ్ స్టేషన్ కు రైతులు గురువారం తాళం వేశారు. ఇవ్వన్నీ ఒకటి రెండు రోజుల్లో మీడియాలో వచ్చిన వార్తలు మాత్రమే. నిజానికి, రాష్ట్రంలో ఇనక నేక చోటల్ ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.అయినా, ప్రభుత్వం మాత్రం, జీవన్ రెడ్డి అన్నట్ల్గు ఇంకా 24 గంటల ఊతపదాన్ని వదలడం లేదు.

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.