అవినాష్.. కింకర్తవ్యం!?

Publish Date:Oct 23, 2024

Advertisement

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ అధికారంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆయనపై ఈగ కూడా వాలకుండా తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడేశారు. కోర్టులు ఆయన అరెస్టుకు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఆయన అరెస్టే తరువాయి అన్న పరిస్థితుల్లో కూడా జగన్ ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ అన్ని ఏర్పాట్లూ చేసింది. సినీ ఫక్కీలో కర్నూలు వరకూ ఛేజ్ చేసింది. అయినా అరెస్టు చేయలేకపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అప్పట్లో అంతా భావించిన పరిస్థితి. వివేకా హత్య కేసులో కీలక పరిణామం అనివార్యం అనిపించిన ప్రతి సందర్భంలోనూ జగన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు వెళ్లేవారు. ఆయన హస్తినలో ఏం చక్రం తిప్పేవారో కానీ.. అరెస్టు తథ్యం అన్న పరిస్థితి నుంచి అవినాష్ సునాయాసంగా బయటపడేవారు. 

ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. హస్తినలో ఆయన పరపతీ పూర్తిగా అడుగంటింది. ఇప్పుడు ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి?  ఆయన అరెస్టు అనివార్యమేనా, అయితే ఎప్పుడు అరెస్టౌతారు. అసలు వివేకా హత్య కేసు విచారణ ఎప్పుడు ట్రాక్ మీదకు వస్తుంది? అన్న ప్రశ్నలు రాజకీయవర్గాలలోనే కాదు.. జన బాహుల్యంలో  కూడా వినిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైందన్న వార్త ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లేనన్న చర్చకు తెరతీసింది. 

ఇంతకూ ఏం జరిగిందంటూ వివేకా హత్య కేసులో నిందితులుగా యాంటిసిపేటరీ బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలు తమ బెయిలు కండీషన్లు సడలించాలని కోరుతూ తెలంగాణ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఆ కోర్టు కొట్టివేసింది. తాము విదేశీ పర్యటనక వెళ్లేందుకు వీలుగా బెయిలు కండీషన్లు సడలించాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 2 వరకూ తాము జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఆ పిటిషన్ నువిచారించిన తెలంగాణ హైకోర్టు.. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సీబీఐ కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాలని కోర్లు తీర్పు చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించినా అక్కడ ఆయనకు సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని న్యాయ నిపుణులు అంటున్నారు.

వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి, వారిపై దాడులు చేసిన చరిత్ర ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ గట్టిగా అభ్యంతరం చెబుతుందని అంటున్నారు.  తెలంగాణ హైకోర్టులో తన అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో  అవినాష్ రెడ్డికి ఇక దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.