తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్!
Publish Date:Aug 27, 2024
Advertisement
స్కాములు చేసేవారు ఇందుకలరు, అందులేరు అనడానికి అవకాశం లేకుండా.. అన్నిచోట్లా వుంటారు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్‌ని పసిగట్టిన తెలంగాణ సీఐడీ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని అనేక ఆస్పత్రుల మీద ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మెడికల్ బిల్లుల స్కామ్‌లో ఆస్పత్రులతోపాటు పలువురు ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు, అధికారుల హస్తం వుందని తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల స్కామ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఫేక్ బిల్లులు సమర్పించడం ద్వారా ఆర్థికంగా లాభపడిన వారి దగ్గరనుంచి సీఐడీ విచారణను ప్రారంభించనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cmrf-scam-25-183684.html
http://www.teluguone.com/news/content/telangana-cmrf-scam-25-183684.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





