హైదరాబాద్ మెట్రో నిధుల విడుదలలో జాప్యం వద్దు.. కిషన్ రెడడ్డికి రేవంత్‌ బహిరంగ లేఖ

Publish Date:Jun 17, 2026

Advertisement

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులు,  ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదలలో  మరింత జాప్యం చేయవద్దని  కోరుతూ  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు.   

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌ 2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం ఏడు కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు  38 వేల 595 కోట్ల అంచనా వ్యయంతో  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 
ఫేజ్‌ 1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్‌ 2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందనీ,  మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్ వర్క్​లో నడిచేందుకు వీలుగా ఫేజ్‌ 1ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకుందానీ ఆ లేఖలో వివరించారు. 

ఫేజ్‌ 1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు  13 వేల 538.53 కోట్లు కలిపి మొత్తం 15 వేల కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్‌ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్‌ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.  

ఐఆర్‌ఎఫ్‌సీ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి, డ్యూ డిలిజెన్స్‌ పూర్తి చేసి రుణ మంజూరు ఒప్పందం చేసిందనీ,   రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిందనీ వివరించిన రేవంత్ రెడ్డి.. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం  84.32 కోట్ల అప్‌ఫ్రంట్‌ ఫీజు చెల్లించిందన్నారు. . ఈక్విటీ  1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసిందని తెలిపారు.  

ఈ ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక, 2026 జూన్‌ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి,  తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగటం లేదనీ,  కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం ప్రకారం ఐఆర్​ఎఫ్​సీ రుణాన్ని  విడుదల చేయించాలని కోరుతున్నామని రేవంత్  ఆ  లేఖలో పేర్కొన్నారు. 

తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు. మెట్రో ఫేజ్‌ 2ను కేంద్రం, రాష్ట్రం 50:50 జాయింట్‌ వెంచర్‌గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని సీఎం ఈ లేఖలో వివరించారు. 

ఒకవేళ అనుమతులు ఆలస్యమైతే..  రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ఫేజ్‌2ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని రేవంత్ ఆ లేఖలో కోరారు.

By
en-us Political News

  
భవిష్యత్ లో ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు జనాభా తగ్గుదలపై సీఎం కీలక వ్యాఖ్యలు..
వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడు టాటా ఏస్ వాహనం చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి
కుల, మతాలకు అతీతంగా జరిపే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఎలా మొదలైంది..?
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం
పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు
యాపిల్ మాక్ ఓఎస్ యూజర్ల కోసం నార్టన్ వీపీఎన్ స్ప్లిట్ టన్నెలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరుస్తూ, నిర్దిష్ట యాప్‌లను వీపీఎన్ పరిధి నుండి ఎలా మినహాయించవచ్చో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఉరుగ్వేపై 1 0 తేడాతో స్పెయిన్ ఘన విజయం. అలెక్స్ బేనా సంచలన గోల్‌తో స్పెయిన్ నాకౌట్ దశకు చేరుకోగా, రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.