తెలంగాణా సిటిజన్ కార్డులు దేనికో

Publish Date:Jul 25, 2014

Advertisement

 

సాధారణంగా అన్ని దేశాలు తమ పౌరులకు గుర్తింపు కార్డులు ఇస్తాయి. మనదేశంలో ఇప్పటికే చాలా మందికి ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి. కానీ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పధకాలలో అవినీతికి తావు లేకుండా అర్హులయిన వారికే ప్రభుత్వ పధకాల వల్ల లబ్ది కలిగేలా చేయడం ఈ కార్డుల ప్రధానోదేశ్యం అని ప్రభుత్వం చెపుతోంది. నిజంగా అవి అందుకొరకే అవి నిర్దేశించబడినట్లయితే, వాటిని తెలంగాణా సిటిజన్ కార్డులని అనడం తప్పు. కానీ ఆవిధంగా పేర్కొనడం ద్వారా రాష్ట్రంలో తెలంగాణా ప్రజల నుండి ఇతరులను అంటే బహుశః తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను, వారి పిల్లలను విడదీసి ప్రత్యేకంగా గుర్తించడానికేనని అర్ధమవుతోంది.

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాస నేతలు తెలుగు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి వారిని దూరం చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణా సిటిజన్ కార్డులు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణేతరులందరిపై సెకండ్ క్లాస్ సిటిజన్లుగా ప్రభుత్వమే ముద్ర వేసినట్లుఅవుతుంది. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత ఏ ఒక్కరిమీదో ఉండదు. దేశంలో యావత్ ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలి. కానీ స్వయంగా ప్రభుత్వమే ప్రజలను ఈ విధంగా విభజించాలని ప్రయత్నించడం హర్షణీయం కాదు.

 

రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు జరుగుతున్నపుడు తెరాస నేతలు తామేమీ దేశం నుండి విడిపోతామని కోరడం లేదు కదా? అని ప్రశ్నించేవారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఆలోచనను ఏమనుకోవాలి? ప్రభుత్వ పధకాలు నిజమయిన, అర్హులయిన లబ్దిదారులకు చేర్చేందుకు గుర్తింపు కార్డులు జారీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో ప్రజల మధ్య దూరం పెంచడాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.

 

రాష్ట్రం విడిపోయినా తెలంగాణాలో స్థిరపడినవారి పట్ల ఎటువంటి వివక్ష ఉండబోదని, రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములా కలిసి ఉందామంటూ తెరాస నేతలు చాలా మంచి మాటలే చెప్పారు. కానీ అవ్వన్నీ ఇప్పుడు పూర్తిగా మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.

By
en-us Political News

  
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.