తెలంగాణ బీజేపీ.. ఈటల వర్సెస్ బండి!

Publish Date:Aug 17, 2024

Advertisement

తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా.. వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. ముఖ్యంగా పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు అధిష్ఠానాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతవారిని సముదాయించలేక, కొత్తవారిని నియంత్రించలేక కమలం అధిష్ఠానం తలలు పట్టుకుంటోంది.

ఆ కారణంగానే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి రెండు నెలలు దాటినా ఇంత వరకూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమౌతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ముందున్న ఈటల రాజేందర్ కు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడు తున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక్క బండి సంజ య్ మాత్రమే కాదు.. బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా వ్యతి రేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సరిగ్గా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటల రాజేందర అన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇదే విషయాన్ని బండి సంజయ్ సహా తొలి నుంచీ బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు.  బండి అభిమానులు,   బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు కూడా ఈటల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించినా బీజేపీ అధిష్ఠానం మధ్యే మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

దీంతో ఇప్పుడు ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్  సంజయ్  అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్యా సయోధ్య కుదిర్చి ఈటలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తల పట్టుకుంటోంది. పరిస్థితి కరవమంటే కప్పకు కోపం... వదల మంటే పాముకు కోసం అన్నట్లుగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.  ఎందుకంటే ఈటల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత.. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలనూ కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటల తనవర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ భయం తోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో   బీజేపీ హైకమాండ్  ఎటూ తేల్చుకోలేక పోతోంది. 

 ఈటల రాజేందర్, బండి సంజయ్ ఈ ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు.అంతే కాదు ఇద్దరిదీ భిన్నమైన రాజకీయ నేపథ్యం.   బండి సంజయ్ ది హిందుత్వ అజెండా. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లలో చురుకుగా పని చేసిన నాయకుడు.  బీజేపీ కి క్రమశిక్షణ గల కార్యకర్త. బండికి ఉన్న ఫాలోయింగ్ ఓ జిల్లాకో, నియోజకవర్గానికో పరిమితం కాదు.   ఈటల విషయానికి వస్తే ఆయన రాజకీయ నేపథ్యం పూర్తిగా భిన్నమైనది. బీజేపీని గట్టిగా వ్యతిరేకించి, ఆ పార్టీ సిద్ధాంతాలను ఇసుమంతైనా నమ్మని కమ్యూనిస్టు భావజాలం ఈటలది. వాస్తవానికి  ఈటల రాజేందర్‌‌ బీఆర్ఎస్ ను వీడిన సమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయనకు రాష్ట్ర బీజేపీ కోర్ లీడర్స్ తో అంతగా పొసగడం లేదు.  
తొలి నుంచీ బీజేపీలో ఉన్న పాతతరం నాయకులెవరూ ఈటలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించవద్దనే అధిష్ఠానానికి చెబుతున్నారు. ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంగా చెబుతున్నారు.  ఈటలకు పార్టీ పగ్గాలు ఇస్తే రాజకీయంగా బీజేపీకి జరిగే మేలు కంటే పార్టీ సిద్ధాంతానికి జరిగే నష్టమే ఎక్కువ అని అంటున్నారు.  ఈ కారణంతోనే బండి సంజయ్ ద్వారా ఢిల్లీ స్థాయిలో ఈటలకు పదవి దక్కకుండా లాబియింగ్ చేస్తున్నారు. ఈ ఒత్తిడికి లొంగి బీజేపీ హై కమాండ్  ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీ వీడటం ఖాయం. అదే జరిగితే బలమైన సామాజిక వర్గం బీజేపీకి దూరం అవుతుంది. తెలంగాణలో మరింత బలోపేతమై భవిష్యత్ లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ లక్ష్యానికి గండి పడుతుంది. పోనీ ఈటలకు అధ్యక్ష పదవి ఇద్దామా అంటే సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటుంది. ఈ కారణంగానే బీజేపీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.