కేసీఆర్ ఇక బేజార్‌.. స‌మ‌రానికి సై అంటున్న ఉద్య‌మ‌కారుల ఐక్య వేదిక‌..

Publish Date:Jul 5, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముహూర్తాన, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్’ చేశారో ఏమో కానీ, ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈటల విషయంలో కేసీఆర్ లెక్క తప్పింది. ఆయన బీజేపీలో చేరడంతో, కథే అడ్డం తిరగింది. ఈటల మీద వేటు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగానూ, ప్రజల్లో ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మరో వంక ఈటల హుజురాబాద్ నుంచి పూరించిన ఎన్నికల సమర శంఖం కేసీఆర్’ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈటల వెంట కదిలిన కమల దళం కేసీఆర్ కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. 

అది చాలదన్నట్లు, కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే.. ఇక్కడ పీసీసీ చీఫ్‘గా రేవంత్ రెడ్డి ఒకడు మోపడైండు. గొంతులో పచ్చి వెలక్కాయ లెక్క రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయి కూర్చున్నాడు. మాటల తూటాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అసలే ఫైర్ బ్రాండ్ ఆపైన పీసీసీ చీఫ్‌. అందుకే కేసీఆర్ ఇప్పటికే కాలికి బలపం కట్టుకుని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 7వ తేదీన రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవచ్చును. అటు ఈటల, బండి సంజయ్.. ఇటు రేవంత్ బ్యాండ్ బజాయిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అయోమయంలో పడిపోయింది. ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు అయోమయంలో చిక్కుకు పోయారు. 

అది అలా ఉంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కారులంతా ఏకమై కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన, చేస్తున్న కేసీఆర్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు సిద్దమవుతోంది.. రాజకీయాలకు అతీతంగా, కేసీఆర్ గడీల‌ పాలన అంతమొందించడమే లక్ష్యంగా జూలై 9న హైదరాబాద్’లో ఉద్యమ కారుల ఐక్య వేదిక పురుడు పోసుకుంటోంది.
నిజానికి, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంగా పక్షం రోజులకు పైగానే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ వర్గాల నేతలంతా ఏకమవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కేసీఆర్ వమ్ము చేశారని ఆరోపిస్తున్న ఉద్యమకారులు..కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఉమ్మడి వేదిక నిర్మించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమకారులు  హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్’లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్’ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరిగి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. అందుకే టీఆర్ఎస్ వర్గాలు కూడా ఉద్యమకారుల కదలికలపై నిఘా పెట్టారని చెబుతున్నారు. 

అంతే కాదు, హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంగా వేదిక నిర్మాణం జరుగుతున్నా.. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని ఉద్యమ నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. నిజానికి ఈటల కంటే ముందు కూడా కేసీఆర్, అనేక మంది ఉద్యమ నాయకులను కరివేపాకు లెక్క తీసి పారేసారు. అయినా, రావాల్సిన‌ స్థాయిలో ప్రజల నుంచి ప్రతిఘటన రాలేదు. ఆ  ధైర్యంతోనే కావచ్చు కేసీఆర్ ఈటలను ఎరేశారు. కానీ, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ..
 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.