హీరోలైన తెలంగాణ ఉద్యోగులు
Publish Date:Oct 26, 2011
Advertisement
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు హీరోలు.. తెలంగాణ నాయకులు జీరోలు... ఇదే ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్న విషయం. సకలజనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమం గోదాలో దిగిన టి.ఉద్యోగులు దాదాపు 40 రోజులపాటు సమ్మెను కొనసాగించారు. వారు తమ సమ్మెను ఎపుడు విరమిస్తారా.. అని సర్కార్ సైతం ఆతృతగా చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిన్నటితో దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఉద్యమాన్ని ఆపలేదంటూ ముక్తాయించాయి. విరమించిన తర్వాత ఉద్యోగ సంఘాలకు చెందిన కొంతమంది నేతలు రాజకీయ నాయకుల నైజాన్ని తూర్పారబట్టారు... అనేకంటే తామే హీరోలమని ప్రకటించుకున్నారు. సమ్మె విరమణ సందర్భంగా ఒక ఉద్యోగ నాయకుడు మాట్లాడుతూ తోలుమందం నాయకులు మాతో కలిసి వస్తారనుకుని ఉద్యమంలోకి వచ్చాం. అయితే మాట ఇచ్చి మడమ తిప్పడంలో ఆరితేరిన ఈ తోలుమందం నాయకులు మాతో కలిసి రాకపోగా పదవులను పట్టుకుని వేలాడుతున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.... తెలంగాణ ఉద్యమానికి కాపలా కుక్కల్లా ఉంటామన్న ఈ నాయకులు గాడిద బరువును తమపై వేసి తప్పించుకున్నారని ఆరోపించారు. వీరి విమర్శలకు, ఆరోపణలకు నాయకులు కిమ్మనడం లేదు. ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నానంటూ చెప్పుకునే కె.కేశవరావు సోమవారం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న శిబిరానికి వెళ్లిన సందర్భంలో ఆయనను కొంతమంది ఉద్యోగులు నిలదీశారు. మీరు ఏసీ గదుల్లో కూర్చుంటే మేము ఉద్యోగాలు మానేసి తిండీతిప్పలు లేకుండా ఉద్యమాలు చేయాలా..? అంటూ ప్రశ్నించారు. దానికి బెంబేలెత్తిపోయిన కేకే, తెలంగాణపై తమకు చిత్తశుద్ధి ఉందనీ, తెలంగాణ వచ్చేవరకూ పోరాటం ఆగదనీ, తెలంగాణ నాయకులు, ఉద్యోగులపై కక్ష్య సాధింపు చర్యలు తగవనీ అన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-24-7924.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





