త్వరలో తెలంగాణ పరిష్కారం: కెకె
Publish Date:Oct 25, 2011
Advertisement
హైదరాబాద్: తెలంగాణ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె.జానా రెడ్డితో భేటీ అనంతరం ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు ముందా, పార్లమెంటు సమావేశాల్లోనా అనేది తాను చెప్పలేనని, తేదీ తాను చెప్పలేనని, కానీ తెలంగాణ సమస్యను తమ అధిష్టానం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల్లోని ఐదారుగురు నాయకులతో,కొంత మంది మంత్రులతో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై మాట్లాడుతుందని ఆయన చెప్పారు.తెలంగాణ సమస్యను ఫోకస్ చేయడానికి సకల జనుల సమ్మె ఉపయోగపడిందని ఆయన అన్నారు. తాము సమ్మె చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తూ, ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ తమ బాధ్యత నిర్వహించామని ఆయన అన్నారు. తాము ప్రజల వెంటే ఉంటామని ఆయన అన్నారు.
లక్ష్యం సాధించినప్పుడే విరమణ ఉంటుందని, తెలంగాణ ఉద్యోగులు ఉద్యమానికి విరామం అంటారో సమ్మె వాయిదా అంటారో తనకు తెలియదు గానీ తాము ఉద్యమంలో ముందుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు.మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ జెఎసిలో సమన్వయం లోపించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు వల్లనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. సమ్మె విమరణతో తెలంగాణ ఉద్యమం వేడి తగ్గలేదని ఆయన అన్నారు. త్వరలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ప్రస్తావన ఉందని ఆయన చెప్పారు.
http://www.teluguone.com/news/content/telangana-24-7918.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





