మరోసారి కేసీఆర్ దీక్ష...?
Publish Date:Oct 25, 2011
Advertisement
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరవధిక దీక్ష చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు ఉన్నారు. తెరాసకు చెందిన 14 మంది శాసనసభ్యులు నిరవధిక దీక్ష చేపట్టే అవకాశం ఉంది. ఈ దీక్షను ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన వారు ప్రారంభించే అవకాశం ఉంది. సోమవారం పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో అందుబాటులో ఉన్న పార్టీ శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ దీక్షపై చర్చ జరిగింది. అవసరమైతే ఆ తర్వాత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే అవకాశం ఉంది.నవంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ్యులు 72 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. ఈ దీక్షలో తెరాస శాసనసభ్యులతో పాటు సిపిఐ, నాగం జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులు పాల్గొంటారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ఈ 72 గంటల దీక్షను నిరవధికం చేయాలని తెరాస శాసనసభ్యులు ఆలోచిస్తున్నారు.
తెలంగాణ ఉద్యోగ వర్గాలు సమ్మెను వాయిదా వేసుకుంటున్న తరుణంలో తాము తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిరవధిక నిరాహార దీక్షలు పనిచేస్తాయని తెరాస శాసనసభ్యులు ఆలోచిస్తున్నారు.హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద దీక్షలు చేసేందుకు తెరాస శాసనసభ్యులు సమాయత్తమవుతున్నారు. ఇందుకు అనుమతి కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారు. ఇందిరా పార్కు వద్ద అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ దీక్షలు చేయాలనే విషయంపై కూడా ఆలోచన సాగుతోంది. కాగా, పోలవరం ప్రాజెక్టు టెండర్ల వివాదం నుంచి బయటపడేందుకే కెసిఆర్ నిరవధిక దీక్షలను తెర మీదికి తెస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శిస్తున్నారు.పోలవరం టెండర్లను దొడ్డిదోవన దక్కించుకుని కోట్లకొద్దీ డబ్బు సంచులు వెనకేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ పోలవరం సమస్యను పక్కదోవ పట్టించేందుకు దీక్షను తెరపైకి తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
http://www.teluguone.com/news/content/telangana-24-7886.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





