తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ..గాల్లోకి కాల్పులు
Publish Date:Jul 13, 2025
Advertisement
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇవాళ ఉదయాన్నే కొందరు జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో క్యూ న్యూస్ సిబ్బందిపైనా అటాక్ చేశారు. ఆ సమయంలో ఆఫీస్‌లోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్‌మెన్‌లు.. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పు పట్టినందుకే దాడి చేసినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిచాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/teenmar-mallanna-39-201912.html





