కడప కోటలో తెలుగుదేశం పాగా?

Publish Date:Apr 5, 2024

Advertisement

కడప రాజకీయాలపై వైఎస్ కుటుంబం ముద్ర బలంగా ఉంది. అందుకే  వైసీపీ ఆవిర్భావం నుంచీ కడప ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటే నడిచిన జిల్లా ఆయన తరువాత జగన్ వెంట నడుస్తూ వస్తోంది. వైఎస్ మరణం వరకూ కడప జిల్లా మొత్తం వైఎస్ వెనుకే నిలబడిందని చెప్పవచ్చు. ఆయన మరణం తరువాత అంతటి మద్దతు జిల్లాలో వైసీపీకి లభించింది. ఇందుకు జగన్ వైఎస్ రాజకీయవారసుడిగా కడప జిల్లా వాసులు భావించడమే కారణం.

రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క రాజం పేట స్థానం నుంచే విజయం సాధించింది.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆ ఒక్క స్థానం కూడా దక్కలేదు. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2024 ఎన్నికలలో పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు 2019 ఎన్నికల కంటే తెలుగుదేశం బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా జిల్లాపై పట్టు మాత్రం వైసీపీదేనని పరిశీలకులు అంటున్నారు. కడప మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలన్నిటిలో తెలుగుదేశం గట్టిగా పుంజుకుంటే కడప జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించదు. గత ఎన్నికలలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించడంలో విఫలమైన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో ఒకటి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పదగ్గ నియోజకవర్గం ఒక్క మైదుకూరు మాత్రమేనని సర్వేలు చెబుతున్నాయి. అలాగే రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  అయితే  కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుండటంతో జిల్లాలో వైసీపీ ఏదో ఒక మేరకు నష్టపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగడంతో రాష్ట్రంలోనే ఈ సీటు హాట్ సీట్ గా మారిపోయింది. జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య విషయంలో వివేకా కుమార్తె సునీత, జగన్ కు సొంత చెల్లెలు అయిన షర్మిలను ముక్తకంఠంతో అవినాష్ దోషి అని ఆరోపిస్తూ, అటువంటి వ్యక్తికి జగన్ అండగా నిలబడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ ను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులకు వత్తాసుగా నిలబడిన జగన్ కు, ఆయన పార్టీకీ ఓట్లు వేయవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా షర్మిలే అవినాష్ కు ప్రత్యర్థిగా కడప బరిలో దిగడంతో.. ఆమె వైసీపీ ఓట్లను ఏ మేరకు చీల్చుతారన్నదానిపై కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం ఆధారపడి ఉంటుంది.  మొత్తం మీద గత ఎన్నికలలో లా జీరో స్థానంతో సరిపెట్టుకోవడం కాకుండా తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.  

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.