బీజేపీకి తెలుగుదేశం ఆఫర్ పాతిక అసెంబ్లీ స్థానాలు.. నిజమేనా?

Publish Date:Aug 31, 2023

Advertisement

ఏపీలో రానున్న ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం  జనసేన, బీజేపీలకు ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తుంది? ఎన్ని లోక్ సభ స్థానాలు కేటాయిస్తుంది? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలు టీడీపీతో పొత్తు కోసం ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నాయి? ఇలా చాలా రోజులుగా ఇవే ప్రశ్నలు రాజకీయ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడిన ప్రతిసారి, చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసినా, పవన్ కళ్యాణ్ తో కలిసినా పొత్తు ఖరారైందని.. జనసేన-బీజేపీలకు కేటాయించిన సీట్లు ఇవేనంటూ కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే  తాజాగా ఢిల్లీలో జరిగిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు  బీజేపీ పెద్దలతో  భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డాతో సమావేశమైన చంద్రబాబు  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు.

ఢిల్లీ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే బీజేపీతో తమకు వ్యక్తిగత శత్రుత్వం లేదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో విభేదించామని చెప్పారు. ఇక సమయం వచ్చినపుడు పొత్తుల గురించి చెప్తానని.. కాలమే పొత్తులను నిర్ణయిస్తుందని చంద్రబాబు చెప్పారు.  కాగా, చంద్రబాబు అలా నడ్డాతో భేటీ అయ్యారో లేదో  ఇలా జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకూ మళ్ళీ యథావిథిగా పొత్తులపై కథనాలు వండి వార్చాయి. బీజేపీ అనుకూల మీడియా ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ప్రసారాలు చేసింది. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం చర్చలలో  ఏకంగా బీజేపీకి 25 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు   ఆఫర్ చేశారని కథనాలు వదిలారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ వార్తా కథనాలన్నీ బీజేపీ అనుకూల మీడియా వండి వార్చినవేనన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి   ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 25 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయిస్తుందనడం వాస్తవానికి దూరంగా ఉందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ కావచ్చు కానీ ఏపీలో ఆ పార్టీకి కనీసమైన స్టేక్ కూడా లేదు. నిండా ఒక శాతం ఓటింగ్ కూడా లేదు.  మరోవైపు ఒంటరిగానైనా ఈసారి టీడీపీ అధికారం దక్కించుకుంటుందని ఇప్పటికే  పలు సర్వేలు పేర్కొన్నాయి.  జనసేన-బీజేపీలతో కలిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్తూనే.. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా వందకు తగ్గకుండా స్థానాలను సొంతం చేసుకుంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేర ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఏపీలో పొత్తులతో సంబంధం లేకుండానే తెలుగుదేశం 15 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుందని పేర్కొంది.  మరోవైపు బీజేపీ కలిసిరాకపోయినా పొత్తుకు జనసేన సిద్ధంగా ఉంది. బీజేపీని దూరం పెడితే.. పవన్ కళ్యాణ్  పొత్తు ఎటూ ఉంటుంది. అదనంగా వామపక్షాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

మరి ఇన్ని అడ్వాంటేజీలు ఉండగా చంద్రబాబు బీజేపీకి ఏకంగా 25 అసెంబ్లీ స్థానాలు ఎలా కేటాయిస్తారు? ఎందుకు కేటాయిస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇంకా చెప్పాలంటే జనసేన-బీజేపీలకు కలిపి కూడా  అన్ని సీటు కేటాయించడం కూడా అనుమానమేనని అంటున్నారు.    ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా బీజేపీకి తెలుగుదేశం అధినేత పాతిక అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేశారన్న ప్రచారం కేవలం బీజేపీ స్ట్రాటజీగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రతి అంశాన్ని తమకు కావాల్సినట్లు మలచుకునే ప్రయత్నం చేసే బీజేపీ ఏపీలో పొత్తుల వ్యవహారాన్ని కూడా ఇదే  విధంగా తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నమే ఈ 25 సీట్ల ఆఫర్ కథనాలను పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు.  అన్నిటికీ మించి మోడీ హవా బ్రహ్మాండంగా వీచిన 2014 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం ఆ పార్టీకి కేవలం 9 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలు కేటాయించింది. మరి తొమ్మిదేళ్ల పాలన తరువాత దేశంలో మోడీ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం బీజేపీకి పొత్తులో భాగంగా ఏకంగా పాతిక స్థానాలను ఆఫర్ చేసిందంటే నమ్మడం కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.