ఇక క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన సమష్టి పోరాటాలు!

Publish Date:Sep 26, 2023

Advertisement

తెలుగుదేశం, జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఖరారైపోయింది. తరువాత అతి ముఖ్యమైన అంశం సీట్ల పంపకం. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు సీట్ల పంపకాలపై పొత్తు ప్రకటనకు ముందే ఇరు పార్టీల మధ్యా ఒక అవగాహన కుదిరింది. ఆ విషయంపై ఇరుపార్టీల అధినేతలూ సమష్టి ప్రకటనకు సిద్ధమౌతున్న సమయంలో అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు అవ్వడంతో సమష్టి ప్రకటనకు అవకాశం లేకపోయింది.

అందుకే  చంద్రబాబుతో ములాఖత్ అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. అప్పటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల పంపకాల విషయంలో ఒక అవగాహన కుదిరిందని చెబుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు రెండు పార్టీలూ దృష్టి పెట్టాల్సిన అంశం క్షేత్ర స్థాయిలో  ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేయాలన్నదానిపైనే. ఇప్పుడు ఇరు పార్టీల నాయకులూ ఆ విషయంపైనే బిజీగా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే.. ఇరు పార్టీల మధ్యా సమన్వయం విషయంలోనూ, సమష్టిగా ప్రజా సమస్యలపై గళమెత్తడంలోనూ పొత్తు ప్రభావం గట్టిగా కనిపించేలా పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు కలిసి పని చేస్తున్నాయి. లోకేష్ యువగళం పాదయాత్రలో జనసేన జెండాలు కనిపించడం ఇందుకు తిరుగులేని సాక్ష్యం. అలాగే చంద్రబాబు పర్యటనల్లోనూ జనసేన పాలుపంచుకుంది.

ఇరు పార్టీల మధ్యా పొత్తు ప్రకటన పవన్ కల్యాణ్ నోటి వెంట ఇటీవలే అధికారికంగా వచ్చినప్పటికీ, అంత కంటే ముందు నుంచే ఆరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. ఇక సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్యా కొంత ప్రతిష్ఠంభన ఉందన భావించడానికి అవకాశం ఇచ్చే కొన్ని ప్రకటనలు ఇరు పార్టీల నుంచీ గతంలో వచ్చినప్పటికీ.. ఇప్పటికే సీట్ షేరింగ్ విషయంలో ఇరు పార్టీల అధినేతలూ ఒక అవగాహనకు వచ్చారనీ, సమస్యలేమీ తలెత్తకుండానే ఇరు పార్టీల అధినేతలూ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలన్న విషయంలో ఒక స్పష్టత కు వచ్చారనీ ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఆ వర్గాల సమాచారం మేరకు పాతిక అసెంబ్లీ స్థానాలలోనూ, మూడు లోక్ సభ స్థానాలలో  జనసేన, మిగిలిన స్ధానాలలో అంటే 150 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం పోటీలో ఉంటుంది.  

ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరం ఏమిటంటే.. ఒకవేళ బీజేపీ కూడా ఈ కూటమితో కలిస్తే పరిస్థితి ఏమిటన్నది? పొత్త ప్రకటన సమయంలోనే జనసేనాని విస్పష్టంగా బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలలో పోటీ చేస్తామన్నారు. అంటే బీజేపీ కలిసి వచ్చే అవకాశం లేదన్న విషయంలో రెండు పార్టీలకూ అప్పటికే ఒక స్పష్టత ఉందని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ బీజేపీ చివరి నిముషంలో కలిసి వస్తామని చెప్పినా, ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న స్టేక్ ను పరిగణనలోనికి తీసుకుని ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. స్టేక్ ను మించి బీజేపీ డిమాండ్ చేస్తే బీజేపీని దూరం పెట్టి ఈ రెండు పార్టీలే కలిసి ఎన్నికల బరిలో జగన్ పార్టీని ఢీ కొనేందుకు ఒక నిర్ణయానికి వచ్చేశాయని చెబుతున్నారు. 

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.