చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
Publish Date:Aug 16, 2024
Advertisement
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది, స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047 రూపకల్పన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాలలో నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానున్నది. దీనికి సిఎం చంద్రబాబు చైర్మన్‌గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా వుంటారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్‌వన్ రాష్ట్రంగా చేసే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం విజన్ 2047ని రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అలాగే అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానున్నది. విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్‌తో చంద్రబాబు నాయుడు చర్చించారు.
http://www.teluguone.com/news/content/tata-chanirman-chandrasekharan-met-chandhrababu-25-183055.html





