చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.?

Publish Date:Oct 14, 2026

Advertisement

దక్షిణాది రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో..  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది,  విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ఆ తరువాత విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు విజయ్.  

అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరిగి వెళ్లారు. అయితే ఈ పర్యటన పైకి సాధారణ పర్యటనగానే కనిపించినా,   తెరవెనుక కీలక రాజకీయ చర్చలు, వ్యూహాలకు వేదికగా మారిందన్నది పరిశీలకుల విశ్లేషణ.  ఏపీ, తమిళనాడు  మధ్య నీటి సమస్యలు  నదుల అనుసంధానం,  జాతీయ రాజకీయ సమీకరణాలపై విజయ్ చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా విజయవాడ ఉత్సవ్ లో చెప్పారు కూడా. 

చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు తమిళనాడు మద్దతుపై చంద్రబాబు, విజయ్ మధ్య సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది.   ఈ ప్రాజెక్టు కృష్ణా డెల్టాను పరిరక్షించడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని అందించడానికి అలాగే  కర్ణాటక  తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జల వివాదాలను శాశ్వత పరిష్కారానికీ కూడా దోహదపడుతుందంటున్నారు. 

అంతే కాకుండా చంద్రబాబుతో భేటీకి ముందు రోజు తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. తన డిమాండ్లను ఆయన ముందుంచారు. ఈ రెండు సంఘటనలనూ బేరీజు వేసుకుంటే.. పొలిటికల్ గా విజయ్ ఎన్డీయే కూటమికి చేరువ అవుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. పరిశీలకులు కూడా ఇదే అంటున్నారు.   ఇటీవల తమిళనాడులో ద్రావిడ రాజకీయాల సంప్రదాయానికి భిన్నంగా తనకంటూ ప్రత్యేక ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్న విజయ్, జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారనడానికి కూడా దీనినే తార్కానంగా చూపుతున్నారు పరిశీలకులు.  

ఇక పోతే చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్  మీడియా ఎదుట  చంద్రబాబు మాదిరిగా విక్టరీ సింబల్ గా రెండు వేళ్లూ చూపుతూ అభివాదం చేయడం ద్వారా తన పర్యటన సక్సెస్ అయ్యిందన్న సంకేతం ఇచ్చారు. విజయ్ బెజవాడ పర్యటన  దక్షిణాదిన రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

[Tamilnadu CM Vijay Victory Symbol,  Chandrababu Naidu Meeting, Godavari Cauvery Linking, Telugu Ganga Project, NDA Alliance Politics, South Political Equations, Telugu One]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.