కరూర్ సభలో కన్నీటి పర్యంతమైన తమిళనాడు సీఎం విజయ్.!

Publish Date:Jul 10, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి,  టీవీకే అధినేత  విజయ్ కరూర్ వేదికగా భావోద్వేగ పూరితంగా చేసిన ప్రసంగం దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ సభలో ఆయన ఎమోషనల్ అయ్యారు.  ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్ కరూర్ పర్యటనలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే.  

బాధితుల కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి బాధితుడి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఆ హామీ మేరకు గురువారం(జులై 9) ఆయన కరూర్ లో పర్యటించి..  బాధితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  భావోద్వేగానికి గురయ్యారు. నాటి తొక్కిసలాట సంఘటన తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని విషాద ఘటనగా అభివర్ణించారు.

నాటి సంఘటనను తలచుకుంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.  తనను  నమ్మి ఆ  సభకు వచ్చిన  వారిని కాపాడుకోలేకపోయానన్నారు.  తనను నమ్మినందుకే   వారు బలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం అంటే కేవలం అధికార పీఠాన్ని దక్కించుకోవడం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించడం అన్నారు.  

బాధితుల కుటుంబాలలో కనీసం ఒకరికైనా స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాల భవిష్యత్తుకు పూర్తి ఆర్థిక భరోసా దొరికినట్లయింది. విజయ్ చూపిన ఈ మానవత్వపు చొరవపై  సామాన్య ప్రజల నుంచీ, రాజకీయ విశ్లేషకుల నుంచి   ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  

Vijay Emotional Speech, Tamil Nadu CM Vijay, Stampede Victims Jobs, Thalapathy Vijay TVK

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఇటీవల సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, . యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మొదలైన కొత్త ఘర్షణ పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. తన స్వార్థపూరిత వ్యూహాల వల్ల ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక నిండా మునిగిపోతోంది.
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది
భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు 3 వేల 216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది.
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.