తొలి బడ్జెట్‌లోనే వరాల జల్లు కురిపించిన సీఎం విజయ్..!

Publish Date:Aug 5, 2026

Advertisement

 

మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్..!

తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పలు కీలక ప్రకటనలు చేసింది. మహిళలు, విద్యార్థులు, చిన్నారులను ఆకట్టుకునేలా వరాల జల్లును ప్రకటించింది. వివాహ వేళ వధువులపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. అన్నన్ సీర్ తిట్టమ్ కింద అర్హులైన వధువులకు 8 గ్రాముల బంగారు నాణెంతో పాటు పట్టు చీర అందించేందుకు ఏకంగా రూ.812 కోట్లు కేటాయించింది.

ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి శిశువుకూ 1 గ్రాము బంగారు ఉంగరం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.560 కోట్లు కేటాయించింది. ఈ ప్రకటన బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కళాశాల విద్యార్థుల కోసం వెట్రి ల్యాప్‌టాప్‌ పథకానికి రూ.2,000 కోట్లు కేటా యించారు. విద్యార్థులకు డిజిటల్‌ విద్యను మరింత చేరువ చేయడమే లక్ష్య మని ప్రభుత్వం తెలిపింది. సామాన్య కుటుంబాలకు కూడా ఊరటనిచ్చేలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 

విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాల ల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.125 కోట్లు కేటాయిం చారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేప ట్టనుంది. ఎలక్ట్రిక్‌ వాహ నాల వినియోగాన్ని పెంచేం దుకు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2031 నాటికి తమిళనాడు ను 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ద డమే లక్ష్యంగా ప్రకటించింది...మొత్తంగా.. విజయ్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌ సంక్షేమం, విద్య, మహిళలు, యువతతో పాటు రాష్ట్ర ఆర్థిక అభి వృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సాగింది. తొలి బడ్జెట్‌లోనే భారీ వరాల ప్రకటనలు చేయడంతో ఈ బడ్జెట్‌ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Tamil Nadu Budget, CM Vijay, TVK Goverment, Vetri laptop, First Budget, Digital education

By
en-us Political News

  
ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.