Publish Date:Aug 17, 2024
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే తప్పకుండా వారికి మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. ఇక జగన్ ప్రతిపక్ష హోదాపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పీకర్ తెలియజేశారు. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యతపై వారికి అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో తిరిగి మంచి రోజులు వచ్చాయన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు మాట్లాడాలన్నారు.అసెంబ్లీలో ప్రతి అంశంపై చర్చ జరగాలని..అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు. ఏ పార్టీకైనా నేను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే. అసెంబ్లీలో సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి అని అయ్యన్న పాత్రుడు కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/suspend-the-mlas-who-did-not-come-to-the-assembly-speaker-ayanna-25-183127.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.