ప్రజాస్వామ్యానికి సంజీవని లాంటి తీర్పు!

Publish Date:Mar 4, 2023

Advertisement

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మన ప్రజాస్వామ్యం వర్దిల్లుతోందన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా విదేశీ గడ్డ మీద నుంచే భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. మోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు కేంద్రం చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయన్నారు. పెగాసన్ స్పై వేర్ తో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఒక్క రాహుల్ గాంధీయే అని కాదు... బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.

కేంద్ర ద్యర్యాప్తు సంస్థల తీరు కూడా వారి ఆరోణలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్య వవస్థకు మూల స్తంభం లాంటి కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే వారినే ఈ రాజ్యంగ బద్ధ సంస్థకు కమిషనర్లుగా నియమించి ఎన్నికలలో లబ్ధి పొందేలా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో ఒక పద్ధతి ప్రకారం జరగాలని విస్పష్టంగా చెప్పడం కచ్చితంగా ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవాలి.  సుప్రీం చెప్పిన విధంగా అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లను నియమిస్తే.. ఇక ఆ రాజ్యాంగ సంస్థపై  ఆరోపణలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సందేహించే పరిస్థితి ఉండదు. ప్రధాని, విపక్ష నేత, సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ప్యానల్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుందనీ, అలా ఆ ప్యానల్ సిఫారసు చేసిన వారినే నియమించాలని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.

ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ సిఫారసల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ పద్ధతికి సుప్రీం తీర్పుతో చెక్ పడినట్లే.  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి స్పష్టమైన మార్గ దర్శకాలతో కొత్త చట్టం తీసుకు వచ్చే వరకూ ముగ్గురు సభ్యుల ప్యానల్ ద్వారానే ఈ నియమకాలు జరగాలని కూడా కేంద్రం ఆదేశించింది.  ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో ప్రధానితో పాటు విపక్ష నేతకు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికీ కూడా భాగస్వామ్యం కల్పించడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతుందనడంలో సందేహానికి తావుండదు.

 2024లో లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు, విమర్శలు  వెల్లువెత్తుతున్న తరుణంలో  ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన నియామకాలకు సరైన చట్టమంటూ ఉండాలని రాజకీయ పార్టీలు పట్టుబట్టకుండా ఉండడంపై  కూడా సుప్రీంకోర్టు   విమర్శించింది. అడుగులకు మడుగులెత్తే ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని చిరకాలం, కలకాలం పదవుల్లో, అధికారంలో కొనసాగాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి  అని కూడా సుప్రీం ధర్యాసనం పేర్కొంది.  దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను శిరసావహించాల్సి ఉంటుంది.

రాజ్యాంగ సూత్రాలకు తగ్గట్టుగా ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నట్లుగా  ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం మారకపోతే   ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల దేశ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనడంలో సందేహం లేదు. . ఎన్నికల కమిషన్‌ ఎంత స్వేచ్ఛగా ఉంటే, ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తే అంత ఉన్నతంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.   

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.