మీడియా ట్రైల్స్ ప్రామాణికం కాదు :జస్టిస్ ఎన్వీ రమణ 

Publish Date:Jul 1, 2021

Advertisement

ఏది సత్యం, ఏది అసత్యం?అసలు ఏది, నకిలీ ఏది?ఏది తప్పు, ఏది ఒప్పు?ఏది మంచి, ఏది చెడు? ...అన్ని విషయాల్లో, అన్ని సందర్భాలలో కాకపోవచ్చును, అందరికీ కాకపోవచును కానీ, చాలా వరకు విషయాల్లో, చాలా సందర్భాల్లో చాలా మందికి  ఇలాంటి  మీమాంస ఎదురు కావడం సహజం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది కాదో తేల్చుకోవడం, చాలా చాలా కష్టం. చివరకు ఎంపీ స్థాయి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు, సత్యాన్ని అసత్యంగా,అసత్యాన్ని సత్యంగా చూపేందుకు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు అనేక చూస్తున్నాం.మంచి చెడులు, సత్యం అసత్యం మధ్య ఉన్న చిన్న సన్నని పొర సోషల్  మీడియాలో చెరిగి పోతోంది. చెదిరి పోతోంది. ఈ మాటలు ఇలాగే, కాకపోయిన ఇదే అర్థం వచ్చేలా అన్నది, ఎవరో కాదు, భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ. 

నిజానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి, మరో టిప్పణి, వ్యాఖ్యానం అవసరం లేదు. ఎందుకంటే, స్వేఛ్చ గీత దాటితే, ఏమవుతుందో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి, దాని గురించి మరింతగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. కానీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బుధవారం ‘రూల్ అఫ్ లా’అనే అంశంపై చేసిన జస్టిస్ పీడీ దేశాయ్ 17వ స్మారకోపన్యాసంలోతైన చర్చకు మాత్రమే కాదు, ఆత్మ పరిశీలనకు అవకాశం కలిపించేలా ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసంధర్భంగా, జస్టిస్ రమణ  ఇతర విషయాలతో పాటుగా,, సోషల్ మీడియా ప్రమాణికతను గురించి విశాలంగా చర్చించారు. విలువైన  వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చే ప్రజాభిప్రాయాలను జడ్జీలు ప్రామాణికంగా తీసుకోరాదని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. 

సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని ఆయన హెచ్చరించారు. అరుపులు, ఆర్తనాదాలు, బిగ్గరగా చేసే నినాదాలు, నిజాలకుమెజారిటీ ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.సోషల్ మీడియాకు తాజా సమాచాన్ని అందించే సౌలబ్యం ఉంటుంది, అయితే, ఏది సత్యం, ఏది అసత్యం?అసలు ఏది, నకిలీ ఏది?ఏది తప్పు, ఏది ఒప్పు?ఏది మంచి, ఏది చెడు? అనేది విడమర్చి విశ్లేషించే సామర్ధ్యం ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. అంటే మీడియా ట్రయల్స్ అన్న దాన్ని న్యాయమూర్తులు తమ కేసులను నిర్ణయించేటప్పుడు ప్రామాణిక, మార్గదర్శకాలుగా తీసుకోరాదని ఆయన సూచించారు. కానీ అంతమాత్రాన జరుగుతున్న వాస్తవాలపై న్యాయవ్యవస్థ  పూర్తిగా విస్మరించరాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.

న్యాయ, శాసన వ్యవస్థ తదితరాలపై న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పుల ప్రభావాన్ని కూడా వీరు అంచనా వేయగలిగి ఉండాలన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీ ..ఈ మూడింటికీ రాజ్యాంగంలో సమాన పాత్ర ఉందని పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో జుడీషియరీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలని..దీనిపై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మరొకరి నియంత్రణ ఉండరాదని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే ప్రధాన బాధ్యత కేవలం కోర్టుల మీదే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉందని, న్యాయ వ్యవస్థ పాత్రకు పరిమితులున్నాయని తెలిపారు. తన ముందుకొచ్చిన విషయాలను మాత్రమే అది పరిశీలించగలదని, ఈ పరిమితే రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతలను మిగతా వ్యవస్థలకు అప్పగిస్తోందని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

నిజానికి జస్టిస్ ఎన్వీ రమణ తమ ప్రసంగంలో సోషల్ మీడియాను మాత్రమే ప్రస్తావించినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, మీడియా ట్రైల్స్ ప్రభావం న్యాయ వ్యవస్థ మీద  ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అదే విధంగా ప్రత్యక్ష్యంగా గానీ, పరోక్షంగా గానీ, న్యాయ వ్యవస్థపై  రాజకీయ భావజాలం ప్రభావం చూపుతోందనే ఆందోళన కూడా లేక పోలేదని , న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థతో పాటుగా, మారుతున్నపరిస్థితులు, సాంకేతికంగా ఇతరత్రా వస్తున్న మార్పలను దృష్టిలో ఉంచుకుని, అన్ని వ్యవస్థలో మార్పులు అవసరం అన్న మాట అన్ని వర్గాల నుంచి వినవస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.