Publish Date:Mar 27, 2023
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి (అరెస్ట్ లాంటి) చర్యలు తీసుకోవద్దని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా, తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ ఈడీ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే
. కవిత పిటిషన్ విచారణ ఈ రోజు సుప్రీంలో జరిగింది. ఆ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణను ఈడీతో కాకుండా.. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరపాలని కోరారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.
ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందని పిటిషన్ ఆరోపించిన కవిత తనను తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లంఘించి.. తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల ఎదుట విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో కవిత వేసిన పిటిషన్ ను, నళిని వేసిన పిటిషన్ కు కోర్టు ట్యాగ్ చేసింది. తర్వాతి హియరింగ్ లో రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-adjournskavita--pitition-three-weeks-25-153028.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.