మరో ఆరు నెలలు అంతరిక్షంలోనే సునీత!
Publish Date:Aug 8, 2024
Advertisement
రోదసిలోకి మూడోసారి వెళ్ళిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు అంటే, మరో ఆరు నెలలో సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే వుండాల్సి వుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే వుంటుందని నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా సునీత, విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ కాప్స్యూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. షెడ్యూలు ప్రకారం జూన్ 14వ తేదీకి వీరిద్దరూ వెనక్కి తిరిగి రావాలి. కానీ, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంతికేక సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో వీరిద్దరూ రెండు నెలలుగా అంతరిక్షంలోనే వుండిపోయారు. వ్యోమగాములు ఇద్దరూ అంతరిక్షంలో సురక్షితంగానే వున్నారని నాసా తన ప్రకటనలో పేర్కొంది.
http://www.teluguone.com/news/content/sunita-williams-could-have-to-stay-in-space-till-february-2025-nasa-says-25-182532.html





