సుబ్బారెడ్డి నోట రాజధాని విశాఖ మాట.. మళ్లీ మళ్లీ పాత పాట

Publish Date:Aug 7, 2023

Advertisement

విశాఖ రాజధాని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు.. అందులో ఒకటి పరిపాలన రాజధానిగా విశాఖ. సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండే పాలన సాగించనున్నారు. ఇలాంటి మాటలు  ఏడాది  కిందటి వరకూ ఏపీ ప్రజలను   ఉలికిపాటుకు గురి చేసేవి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి అవసరం ఉండే పరిపాలన రాజధానిని ఒక మూలన ఉండే విశాఖకు తరలించడం ఏంటన్నది ఎప్పటి నుండో సగటు ప్రజలతో పాటు మేధావుల వాదన. కానీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఏది ఏమైనా పరిపాలన విశాఖ నుండే అంటూ మూర్ఖంగా వాదిస్తూ వచ్చింది. అయితే మూడేళ్లుగా ఇదే మాట వినీ వినీ ప్రజలలో ఇప్పుడు దీనిపై చలనం కూడా ఉండడం లేదు. ప్రకటనలు తప్ప ఇది సాంకేతికంగా జరిగే పని కాదులే అని ఏపీ ప్రజలు డిసైడైపోయి ఆ మాటలను లైట్ తీసుకుంటున్నారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం ఇంకా విశాఖకు రాజధాని అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి వారు సమయం సందర్భం ఉన్నా, లేకుండా ఇప్పటికే ఎన్నోసార్లు ఈ మూడు రాజధానుల ముచ్చట, అందులో విశాఖకు రాజధాని తరలింపుపై ఎన్నో ప్రకటనలు చేశారు. అందులో చాలా మంది ఇప్పుడు ప్రజలకు, మీడియాకు కూడా మొహం చాటేస్తున్నారు. ఇంకా విశాఖ రాజధాని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోయి నవ్వే పరిస్థితి వచ్చిందని ఈ నేతలకు కూడా అర్ధమైపోయింది. కానీ, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు సీఎం జగన్ కు మరో బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం త్వరలోనే విశాఖకు రాజధాని అంటూ కామెడీ ప్రకటనలు చేస్తున్నారు.

తాజాగా వైజాగ్-వన్ ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్నారు. లీగల్ ఇష్యూస్ కారణంగా రాజధానిగా విశాఖ ఆలస్యమవుతోందని.. మరో మూడు నెలల్లో రాజధాని విశాఖకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం  వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా, టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. మంగళవారం (ఆగస్టు 8)తో  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరీ గవుడు ముగుస్తుంది. దీంతో ఆయన ఆ రోజు నుంచీ పూర్తిగా ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే మరోసారి విశాఖే  రాజధాని అని.. మరో మూడు నెలల్లో జగన్ విశాఖకు తరలి రానున్నారని.. దసరా తర్వాత విశాఖ నుండే పాలన కొనసాగుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. 

అయితే  వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అరిచి గీపెట్టినా రాజధాని విశాఖ తరలింపు అంశం అధికారికంగా జరిగే పనికాదు. ఒక పక్క ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని సుబ్బారెడ్డి అంటూనే విశాఖకు రాజధాని అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధాని చేస్తామని.. అక్కడ భూములను ప్రభుత్వానికి ఇస్తే అభివృద్ధి చేసి ఇస్తామని అక్కడి రైతులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే.. రాజధాని రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఈ పరిహారాన్ని కట్టాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మినా సరిపోదు. ఒకవేళ శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కదా అని వైసీపీ ప్రభుత్వం వాదించినా.. ఏకైక రాజధాని, అదీ అక్కడే ఉండేలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రకరకాలుగా అమరావతి రైతులకు అగ్రిమెంట్ చేసి ఉంది. 

ఈ చట్టాల ప్రకారమే ఇప్పుడు వైసీపీ అడుగు ముందుకు వేయలేకపోతుంది. ఈ చట్టాల ఆధారంగానే కోర్టు తీర్పులు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు నిండా ఎనిమిది తొమ్మిది నెలల సమయం కూడా లేదు.  ఈ లోగా అనధికారికంగా విశాఖకు రాజధాని తరలింపు చేయాలని భావించినా.. అక్కడ పరిస్థితులు చక్కదిద్దుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే, ప్రజలు విశాఖకు రాజధాని తరలింపు అంశాన్ని పూర్తిగా మార్చిపోయారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం ఇదిగో ఇలా మళ్ళీ మళ్ళీ ప్రకటనలు చేసి ఇంకా ఇంకా చులకన అవుతున్నారు.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.