హైదరాబాద్‌లో మహిళల భద్రతను మరింత బలో పేతం చేయడమే లక్ష్యంగా స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.నగరంలో మహిళలకు సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవ లను అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసు కొచ్చినట్లు ఆయన పేర్కొ న్నారు. ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్‌తో పాటు 4 ఆటో రైడ్స్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.
మహిళలు డ్రైవింగ్ రంగం లోకి రావాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమన్న ఆయన . గత కొంతకాలంగా సరైన మద్దతు లేకపోవడంతో కొంతమంది మహిళలు క్యాబ్ సేవల నుంచి దూర మయ్యారన్నారు. అలాగే.. మహిళా రైడర్లుగా నియమితులైన వారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి మహిళా రైడర్ల సంఖ్యను పెంచేలా కృషి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర డిజిపి సి.వి ఆనంద్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stree-ride-for-women-safety-36-222071.html
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.