రేవంత్ వర్సెస్ కిషన్.. అసలు కథ ఇదా ?

Publish Date:Mar 1, 2025

Advertisement

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులూ ఉండరు.  శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, ఇది ఎప్పటి  నుంచో  రాజకీయుల నాలుకలపై నానుతున్న నానుడి. నిజం కూడా. కావాలంటే అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు దొరుకుతాయి. ఎవరి దాకానో ఎందుకు, మనం ఇప్పడు మాట్లాడుకుంటున్నతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయమే తీసుకుంటే, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గడపలు ఎక్కి దిగారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో,ఆయన పాదం మోపని పార్టీ లేదు. బీజేపీతో ప్రత్యక్ష అనుబంధం లేక పోయినా, ఆర్ఎస్ఎస్ అనుబంధంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అంతే కాదు..  ఇప్పటికీ ఆయన పాత వాసనలను పూర్తిగా వదులుకోలేదు. ఈ మధ్య కాలంలోనే ఒకటి రెండు సందర్భాలలో ఆయన బహిరంగ వేదిక నుంచి, సాగర్జీ (మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు), బండారు దత్తాత్రేయ ( హిమాచల్ ప్రదేశ్ గవర్నర్) వంటి బీజేపీ పాత తరం నేతలతో పాటు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వంటి ఈ తరం బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

ఇప్పడు, ఆ అనుబంధమే ఆయన కుర్చీకి ఎసరు తెస్తోందా, అంటే, చివరికి ఏమి జరుగుతుందో ఏమో కానీ, పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు, ఆయన రాజకీయ మూలాలను అస్త్రంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. ముఖ్యంగా, కర్ణాటకలో డీకే శివకుమార్ బీజేపీ,సంఘ్ పరివార్ కు దగ్గరవుతున్నారనే అనుమానం’తో ఆయన ప్రత్యర్ధి వర్గం, ఆయన కాషాయం కట్టేస్తారనే ప్రచారం సాగిస్తోంది. ఆ విధంగా, ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపి కొడుకును ప్రమోట్ చేసుకునేందుకు తొందరపడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో    పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతులు కలిపారని అంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం, కర్నాటక ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుతెలుస్తోంది. అందులో  భాగంగా రేవంత్ రెడ్డికి పూర్వాశ్రమంలో సంఘ్ పరివార్ సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికి తీసి, దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఈ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకే  ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై, ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడుతున్నారని అంటున్నారు. 

అయితే  రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు, ఆయన ముఖ్యమంత్రి కాక ముందు నుంచీ పార్టీలోని ప్రత్యర్ధులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. అప్పటి నుంచే  రేవంత్ రెడ్డి కుర్చీకి సెగ తగులుతూ వుంది. అందుకే అప్పట్లో రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఎంత కాలం ఉంటారనే  విషయంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. నిజానికి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తల్లోనే రేవంత్ రెడ్డి  ఐదేళ్ళు ముఖ్యంత్రిగా ఉంటానని చెప్పే  సాహసం చేయలేదు. ఎంతకాలం ఉంటే అంతకాలం ప్రజలకు మేలు చేస్తానని మాత్రమే చెప్పారు. అందరి ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి, వన్ ఇయర్ మైలు రాయిని దాటేశారు. ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.

కానీ మరో వంక  ఆయన్ని కుర్చీ దింపే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలా కుర్చీకి ముప్పు వచ్చిన ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి  రాజకీయ చతురతతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నారు. ఇతర చిన్నా చితకా ప్రయత్నాల విషయం పక్కన పెడితే.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు  రేవంత్ రెడ్డి బిగ్ బ్లో ఎదుర్కొన్నారని  రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే కొంత చర్చ జరిగింది. అప్పట్లో  రేవంత్ రెడ్డి  ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్య నాయకులతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న పూర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని బయట పడ్డారని అంటారు.  

అవును. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా నెలల పాటు అటూ ఇటూ ఊగి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ, బడా కాంట్రాక్టర్ ఒకరు  మొదటి నుంచి ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేశారు. సదరు నాయకుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీతో నేరుగా ‘డీల్’ సెట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పు అందడంతో జాగ్రత్త పడ్డారు. ఎన్డీఏ ముఖ్య’ నాయకులతో తనకు ఉన్న వ్యక్తిగత పుర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని చక్రం తిప్పారని అప్పట్లో గుసగుసలు వినిపిచాయి. అందుకు తగ్గట్టుగానే  ఆ తర్వాత సదరు మాజీ ఎంపీ  ఇల్లు వాకిళ్ళు, కార్యాలయాల పై ఏక కాలంలో సీబీఐ, ఈడీ దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు సంబంధించి అధికారిక సమాచారం లేక పోయినా, పెద్ద మొత్తంలో సొమ్ములు పట్టుబడ్డట్టు వార్తలొచ్చాయి.దీంతో  ఢిల్లీతో కుదుర్చుకున్నడీల్ మెటీరలైజ్  కాలేదని, ఆ విధంగా రేవంత్ రెడ్డికి ఎక్స్టెన్షన్  వచ్చిందని రాజకీయ వర్గాల్లో అప్పట్లో గుసగుసలు వినిపించాయి. 

ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే  ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడడం వెనక కూడా తన కుర్చీని కాపాడుకునే వ్యూహం ఉందని అంటున్నారు.  అయితే, ఈసారి ‘కిస్సా కుర్సీకా’ లో .. ఎవరు గెలుస్తారో?

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.