ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయండి.. ఐపీఎస్ సునీల్ కుమార్ భార్య
Publish Date:Jun 30, 2026
Advertisement
స్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు ఆయన భార్య షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న సునీల్ కుమార్ ఈ రోజే పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగానే.. ఆయనకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆయన భార్య పి. అరుణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిటిషన్ సమర్పించారు. తమ మధ్య వైవాహిక వివాదాలు ఉన్నాయని, తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై 2017 జూన్‌లోనే కేసు నమోదైనట్లు పేర్కొన్న ఆమె.. ఒకవేళ ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తే.. తన జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్ కుమార్.. అప్పట్లో ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/stop-his-retirement-benefits-36-224631.html





