అమెరికా, ఇరాన్ శాంతి చర్చల పునరుద్ధరణపై ప్రతిష్ఠంభన
Publish Date:Apr 22, 2026
Advertisement
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడమే ఇందుకు కారణమని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది. అయితే.. చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడినా, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొన్న ట్రంప్.. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలకు పెట్టిన కండీషనే.. నౌకా దిబ్బంధనాన్ని తొలగించాలని కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు అన్నది అనుమానమేనంటున్నారు పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/stalemate-over--resumption-of--peace-talks-36-217936.html





