వేదిక కుప్పకూలడంతో గాయపడ్డ చంద్రబాబు

Publish Date:Oct 27, 2012

Advertisement

 

చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శనివారం కొనసాగడం అనుమానంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి గద్వాలలో బహిరంగసభ వేదిక ఒక్కసారిగా కూలడంతో ఆయన వెన్నుపూసకు గాయం అయింది. సభ దగ్గరనుండి ఓ కిలోమీటరున్నర నడిచిన చంద్రబాబు ఆ తరువాత నడవలేక తన వెంట వచ్చే వాహనం తెప్పించుకుని అందులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత మరి కొంత దూరం నడిచి మరింత ముందుకు వెళ్లలేక తాను బస చేయాల్సిన చోటుకంటే ముందే ఆయన ఆగిపోయారు. వైద్యుల సలహామేరకు ఆయన యాత్రకు శనివారం విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. శనివారం గద్వాల, శెట్టి ఆత్మకూర్, ఈడిగోనిపల్లి, మదనపల్లి, పెద్దపాడు, పెద్ద చింతలరేవు, జూరాల ప్రాజెక్టు వరకు యాత్ర సాగాల్సి ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎక్స్ రే తీసిన అనంతరం వైద్యులు రెండురోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ఇప్పటికే 500 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసినందున విశ్రాంతి అవసరమని చెప్పారని పార్టీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని బాబును కోరతామని ఆయన వెల్లడించారు. వేదిక కూలిన సంఘటనలో చంద్రబాబుతో పాటు గద్వాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ లత్తిపురం వెంకటరామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కల రమాదేవి, టీడీపీ జిల్లా కార్యదర్శి రాములు, చేనేత కార్మికులు గోపీనాథ్, లలితమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

By
en-us Political News

  
కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ నుఎత్తివేయనుంది.
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు.
 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది.  న్యూ మెక్సికో  లోని పాఠశాలలో  ఒక సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగ  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌  నేటి నుంచి  రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో ఆయన అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో  సమావేశమవుతారు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజలుగా పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు.
 రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  మార్కాపురం తెలుగుదేశం ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు బోల్తా పడింది.
కర్ణాటక సిఎం కోసం ఢిల్లీలో కసరత్తు కర్ణాటకలో సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్ననే హస్తిన చేరుకోగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్ఫూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తెలంగాణలో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.