అంగరంగ వైభవంగా.. కన్నుల పండువగా రథోత్సవం
Publish Date:Oct 1, 2025
Advertisement
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోరోజైన బుధవారం (అక్టోబర్ 1) ఉదయం శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srivari-rathotsavam-in-tirumala-brahmotsavalu-36-207200.html
http://www.teluguone.com/news/content/srivari-rathotsavam-in-tirumala-brahmotsavalu-36-207200.html
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026
Publish Date:Apr 24, 2026





