క్రీడా శాఖమంత్రిగారు మళ్లీ బుక్కయ్యారు..
Publish Date:Aug 29, 2016
Advertisement
కేంద్ర క్రీడా శాఖమంత్రి విజయ్ గోయల్ ఈమధ్య ఎక్కువగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. దానికి కారణం.. ఆయన చేస్తున్న ట్వీట్లే.. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్లే ఆయనపై విమర్శలు చేయడానికి కారణమయ్యాయి. అథ్లెట్ సర్బానీ నందాకు శుభాకాంక్షలు చెబుతూ ద్యుతీ చంద్ చిత్రాన్ని పోస్ట్ చేయడం, దీపా కర్మాకర్ పేరుకు కర్మనాకర్ అని రాయడంతో నెటిజన్ల నోళ్లలో నానారు. అయితే ఇప్పుడు మరోసారి తప్పులో కాలేసి విమర్శలపాలయ్యారు. నిన్న ప్రధాన మంత్రి మోడీ రియో బలింపిక్స్ విజేతలను కలుసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ గోయల్ మాట్లాడుతూ.. "ప్రధాని ఇవాళ ఖేల్ రత్న, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య అవార్డు విజేతలను కలుసుకున్నారు. వారిలో రియో గోల్డ్ మెడలిస్టులు పీవీ సింధు, సాక్షి మాలిక్ ఉన్నారు" అని నోరు జారారు. ఇంకేముంది పీవీ సింధు, సాక్షీ మాలిక్ లను స్వర్ణ పతక విజేతలుగా అని మళ్లీ ఒకసారి బుక్కాయ్యారు. ఇక అంతే విజయ్ గోయల్ పై సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు.. నోరు జారడంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కు గట్టి పోటీ ఇచ్చేవారు ఇప్పటికి ఒకరొచ్చారని ఒకరంటే, ఓ కామెడీ షోను హోస్ట్ చేసేందుకు కపిల్ శర్మకు పోటీదారు లభించాడని మరొకరు వ్యాఖ్యానించారు. తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన విజయ్ గోయల్ "ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ప్రజలు దాన్నో ఇష్యూ చేస్తున్నారు. ఇది నా విషయంలో చాలాసార్లు జరిగింది. నా ఉద్దేశం మనవాళ్లు బంగారు పతకాలు సాధించిన వారితో సమానమేనని. ఎవరికి తెలుసు మనకూ భవిష్యత్తులో గోల్డ్ మెడల్స్ రావచ్చేమో!" అన్నారు. మొత్తానికి విజయ్ గోయల్ తాను చేసిన వ్యాఖ్యలను బాగానే కవర్ చేసుకన్నారు.
http://www.teluguone.com/news/content/sports-minister-vijay-goel-39-65748.html





