స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 19, 2023

Advertisement

21.  యమునా నది   మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీ మళ్లీ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా యమున ఉప్పొంగి ప్రవహిస్తోంది. 

...................................................................................................................................................

22. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.   అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల   కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

............................................................................................................................................

23. సిటీ బస్సులో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ  టికెట్ల కొనుగోలుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌  విధానాన్ని తీసుకురానుంది. దీంతో కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా   నగదు రహిత టికెట్‌ కొనుగోలు చేయడానికి వీలౌతుంది.  

.....................................................................................................................................

24. తిరుమల నడకదారిలో చిరుతపులి సంచారం భక్తులను భయపెడుతోంది. తాజాగా నిన్న రాత్రి  33 వ మలుపు వద్ద చిరుత సంచారాన్నిభక్తులు గుర్తించారు.  నడకదారిన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగానే  వెళ్లాలని ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ అధికారులు  సూచిస్తున్నారు.  

........................................................................................................................................

25. రోడ్డు ప్రమాద మరణాలలో ప్రపంచంలోనే భారత్ అగ్ర స్థానంలో ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా  ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.  ఈ వివరాలను ఫిక్కీ నివేదిక వెల్లడించింది. మానవుల మరణాలలో  రోడ్డు ప్రమాదాలు 8వ స్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

.......................................................................................................................................

26.శంషాబాద్ విమానాశ్రయంలో 1.7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో కొందరు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

.......................................................................................................................................

27.వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ సర్కార్ ను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.

................................................................................................................................................

28. మూడు పంటలు, 24 గంటల కరెంటు అంటూ  బీఆర్ఎస్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని వైఎస్సీర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కనీసం ఎనిమిది గంటల కరెంటు కూడా ఇవ్వలేనోళ్లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ట్వీట్ చేశారు.

...................................................................................................................................................

29. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరైన పార్టీలలో కొన్ని పార్టీల పేర్లే తాను ఎన్నడూ వినలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.  ఊరూపేరూ లేని పార్టీలు ఆ మీటింగ్ కు హాజరయ్యాయని విమర్శించారు. 

................................................................................................................................

30. ఒడిశా బాలేశ్వర్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో  రైలు  లూప్ లైన్లో ప్రవేశించింది. అయితే లోకోపైలట్ అప్రమత్తతతో  బ్రేకులు వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.  

................................................................................................................................................................

31.పెద్దపల్లి జిల్లా  రంగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు దుప్పి పడిపోయింది. ఇది  గమనించిన గ్రామస్తులు   దానిని బయటకు తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు గ్రామస్తులను అభినందించారు. 

.................................................................................................................................................

32. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రేపటి నుంచి పర్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

.........................................................................................................................................................

33. విపక్షాల ఐక్యతా సమావేశానికి వేదిక అయిన బెంగళూరులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఒక వంతెనను నిర్మించలేని వ్యక్తి దేశానికి ప్రధాని పదవికి పోటీ పడటమా అంటే వెలిసిన పోస్టర్లను బెంగళూరు నగరపాలక సంస్థ తొలగించింది.

..................................................................................................................................................

 

34. ర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఐదుగురు అనుమానితులను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.  

......................................................................................................................................................

35. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా  మరో సారి ఫైర్ అయ్యారు. పవన్  దళపతి కాదు దళారి అంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు కోసం జగన్  ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.  

.........................................................................................................................................

36. మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన  కేసీఆర్‌ కానుక పథకం దరఖాస్తులకు  రేపటితో గడువు ముగియనున్నది.   నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది.  

...................................................................................................................................................

 

37. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు   మహారాష్ట్ర పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని   వాటేగావ్‌ లో తుకారం భావురావ్‌ సాఠే జయంతి వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. మహాలో బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. 

.............................................................................................................................................

38. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ   దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు.   హఫీజ్‌పేట్‌ డివిజన్‌కు చెందిన  పలువురు వ్యాపారులు   బీఆర్‌ఎస్‌లో  చేరిన సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.  

...................................................................................................................................................

39.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయాత్ నగర్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య కలకలం రేపింది.   అక్క చెల్లెళ్లయిన మగ్గిడి గంగవ్వ (62 ) ,మగ్గిడి రాజవ్వ (72 )ను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో కొట్టి హత్య చేశారు.

..............................................................................................................................................

40. ఆగస్టు 8న పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్  జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియడానికి రోజుల ముందే రద్దు చేసేందుకు  పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.