స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 19, 2023

Advertisement

1.ఢిల్లీ వాసులను పాములు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలలో పాములు కొట్టుకు వస్తుండటం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది.   రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సమీపంలోనే ఏకంగా పాతిక పాములను పట్టుకున్నారంటే   తీవ్రత అర్ధమౌతోంది.

...............................................................................................................................................

2. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డగోలు పన్నులను తగ్గిస్తామని  లోకేష్ అన్నారు. .కొండపి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  జగన్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.  

..................................................................................................................................

3.  వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలో మాట్లాడిన ఆయన తాము విపక్షంలో ఉన్నప్పుడూ సానుకూల రాజకీయాలు చేశామే తప్ప విదేశాల నుంచి సహకారం తీసుకోలేదని చెప్పారు.  

........................................................................................................................................

4.ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైఅట్రాసిటీ కేసు నమోదుకు  చిత్తూరు కోర్టు ఆదేశించింది. మంత్రి ఎస్సీలను అవమానించేలా మాట్లాడారంటూ చిత్తూరు జిల్లా కోర్టులో మాజీ జడ్డి రామకృష్ణ దాఖలు చేసిన ప్రైవేటు కేసుపై చిత్తూరు కేసు బీ కొత్త కోట పోలీసులకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి విచారణ నివేదిక అందించాలని ఆదేశించింది. 

..................................................................................................................................

5.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,   సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా భోపాల్ లో ల్యాండ్ అయింది. ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు వారు బెంగళూరు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

..................................................................................................................................

6. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ఆయన ఇస్లామిక్ ప్రపంచానికి, ముఖ్యంగా అరబ్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరువకావడం ఆదర్శప్రాయమన్నారు. మోడీ  విదేశాంగ విధానం బాగుందన్నారు.

..................................................................................................................................

7.   రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి తప్పించాలంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాశారు.  రేవంత్ రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని అవమానించారనీ, అలాగే ప్రజలను కులాల పేరుతో కించపరుస్తున్నారనీ ఆ లేఖలో ఆరోపించారు.

..................................................................................................................................

8. ప్రముఖ రచయత శ్రీరమణ కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. మిథునం,మరియు ఎన్నో కథలు,నవలల రచయిత శ్రీ శ్రీ రమణ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన రాసిన మిథునం కథ  అదే పేరుతో సినీమాగా వచ్చింది.  

...................................................................................................................................

9. హైదరాబాద్ నగరాన్ని  ముసురు కమ్మేసింది. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా జోరుగా  వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచీ కురిసిన వర్షానికి పలు తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  

..................................................................................................................................

 

10.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం అంటూ జూలై 18న శ్రీవారిని 64వేల మంది దర్శించుకున్నారు. 24 వేల 659 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  హుండీ ఆదాయం మూడు కోట్ల 6 లక్షలు వచ్చింది.

..................................................................................................................................

11. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది.  బీఎస్పీ, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్,   వంటి పార్టీలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. 

..................................................................................................................................

12.  టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం   వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది.   టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్  జంగా నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

..................................................................................................................................

13. పరువునష్టం కేసులో   సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది.  చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని  అమ్ముకుంటున్నారని  జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

14. తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి  జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు, ముఖ్య అధికారుల‌తో మాట్లాడారు. సీనియర్ అధికారులతో  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

..................................................................................................................................

15. ఏపీలో  పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్​డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయన్నారు.

..................................................................................................................................

16. ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని కల్పించాలని  రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందు కోసం రైల్వే టికెట్‌ బుకింగ్‌లో  మార్పులు తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో  టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

..................................................................................................................................

 

17. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ఈ నెల 21న  బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డి  నేడు స్వదేశానికి చేరుకోనున్నారు. 

..................................................................................................................................

18. ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. 

19. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులను అందించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్డులను స్థానిక   ప్రజాప్రతినిధుల ద్వారా  లబ్ధిదారులకు అందించనున్నారు. 

......................................................................................................................................................

20. ఏపీలో  వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. 

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.