తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన దిగ్గజ గాయకుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా బాలుకు ఘన నివాళులర్పించారు. ఈ విశ్వంలో తెలుగు భాష ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం వినిపిస్తూనే ఉంటుందని, ఆయన సంగీత ప్రియుల గుండెల్లో ఎల్లకాలం జీవించే ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు.
బాలు గొంతు కేవలం పాట మాత్రమే కాదు, అది సంగీత ప్రపంచానికి జరిగిన ఒక గొప్ప అభిషేకంగా చంద్రబాబు అభివర్ణించారు. స్పీబాలసుబ్రహ్మణ్యం మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ, ఆయన సృష్టించిన స్వరాల సామ్రాజ్యం నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటుందని సీఎం చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
కాగా బాలు 80వ జయంతి సందర్భంగా అభిమానులు, సంగీతకారులు దేశవ్యాప్తంగా ఎంతో వినూత్నంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఎస్పీబీ.. ఎయిటీ టు ఎటర్నిటీ పేరిట ఒక అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బాలు పాడిన మధురమైన రేర్ సాంగ్స్‌ను విడుదల చేస్తూ శ్రోతలకు సరికొత్త అనుభూతిని పంచుతున్నారు. మరోవైపు చెన్నైలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ది మ్యూజిక్ అకాడమీ వేదికగా బాలు స్మరణార్థం ఒక భారీ సంగీత విభావరి కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.
తరాలు మారుతున్నప్పటికీ ఎస్పీబీ స్వర మాధుర్యం ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ మైమరపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాలుతో ఉన్న అవినాభావ సంబంధాన్ని, వారి గుండెల్లో ఆయన సంపాదించుకున్న చెరగని స్థానాన్ని ఈ జయంతి వేడుకలు మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటిచెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spb-80-anniversary-36-221748.html
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.