నరేంద్రమోడి పై సోనియాగాంధీ ఫైర్
Publish Date:Oct 3, 2012
Advertisement
కాంగ్రెస్ హయాంలోనే గుజరాత్ అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కేంద్రం నుంచి గుజరాత్ సర్కార్‌కు 50 శాతం నిధులు వస్తున్నాయని, ఆ విషయాన్ని మోడీ ప్రభుత్వం చెప్పడంలేదని సోనియా ఆరోపించారు. గుజరాత్‌లో మోడీ హాయంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సోనియా మోడీపై నిప్పులు చెరిగారు. రైతులకు తగిన ప్రతిఫలం లభించటంలేదని, నీటి కోసం రైతులు అలమటిస్తున్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్డీఐలతో గుజరాత్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలాలను అనుభవిస్తూ కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని మోడీ సర్కార్ను పరోక్షంగా విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవటంలో మోడీ సర్కార్ విఫలం అయ్యిందన్నారు. ప్రపంచంలో గుజరాతీలు ఎక్కడున్నా తెలివిగా జీవించగలరంటూ సోనియా ప్రశంసించారు. అవినీతిపై భారతీయ జనతా పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని సోనియా డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో బిజెపియే నీరుగార్చిందని ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/sonia-gandhi-in-gujarat-31-17861.html





