రూ 120 కోసం.. మామ ప్రాణం తీశాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Publish Date:Jul 7, 2021
Advertisement
పగకోసం పక్కవారిని చంపడం మూర్ఖత్వం.. అదే పైసల కోసం మరొకడ్ని చంపడం నేరం.. అదే డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళను చంపడాన్ని ఏమంటారు మరి.. అది ఏ లక్షల కోసమో కాదు.. కోట్లకు కాదు.. జస్ట్ రూ 120 కోసం మేనమామనే చంపాడు ఓ వ్యక్తి.. ఎవడైనా ఒక వ్యక్తిని చంపాడు అంటే ఏ కోట్లు రావడం కోసమో.. చేస్తాడు వీడేంటి మరి దారుణంగా రూ 120 ఒక వ్యక్తిని చంపడం అని అనుకుంటున్నారా? మీకు ఉన్న అనుమానం క్లియర్ కావాలంటే ఈ వార్త చదవాలి మీరు.. మరింకెందుకు ఆలస్యం.. పదండి వివరాల్లోకి.. అది గ్యాలియర్‌లోని ఓల్డ్ కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో కయూమ్ ఖాన్ చేపలను విక్రయించేవాడు. అతని మేనల్లుడు కల్లుఖాన్ సమీపంలో చేపల వేపుడును అమ్ముతూ జీవించేవాడు. ఇద్దరు మామఅల్లులు కలిసి మెలిసి ఉండేవాళ్ళు ఆదివారం రాత్రి కల్లు ఖాన్ అతని మేనమామ దగ్గర రూ.120కి చేపలను విక్రయించి.. అల్లుడే కదా డబ్బులు ఇవ్వడమే ఎందుకులే అని అనుకున్నాడు ఆ మేనమామ. పైసల్ అంటే మాములు విషయం కాదు కాదా శత్రుత్వాన్ని మిత్రుత్వం గాను మిత్రుత్వాన్ని శత్రుత్వం గాని చేస్తాయి.. డబ్బు ముందు బంధువులు, ప్రేమలు ఏం పనికి రావు.. మామ డబ్బులు ఇవ్వలేదని అల్లుడు కల్లు ఖాన్ మేనమామకు రూపాయలు 120 ఇవ్వాలని అడిగాడు.. అంతటితో అల్లుడితో మామ గొడవకు దిగాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మేనల్లుడు కల్లుఖాన్.. కత్తితో మామ కయూమ్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కయూమ్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కయూమ్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన అనంతరం కల్లు ఖాన్ అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో మృతుడి కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/son-inlaw-asks-rs-120-for-fish-breathes-last-after-being-brutally-assaulted-39-119011.html





