ఆడలేక మద్దెలు ఓడు అంటే ఎలా సోము వీర్రాజు గారూ!

Publish Date:Mar 2, 2023

Advertisement

ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుగా తయారైంది సోము వీర్రాజు పరిస్థితి. ఏపీలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీని పూర్తిగా కనుమరుగు చేయడమే లక్ష్యమా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు పట్ల సహజంగానే పార్టీలో అసంతృప్తి, అసమ్మతి పెచ్చరిల్లాయి. ఆయన ఒంటెత్తు పోకడలను భరించ లేక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అదే దారిలో మరింత మంది ఉన్నారన్న వార్తలూ విస్తృతంగా వినవస్తున్నాయి.

అలా పార్టీకి గుడ్ బై చెప్పే వారిలో రాష్ట్ర విభజన తరువాత వచ్చి చేరిన వారే కాకుండా మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి పని చేసిన వారూ ఉన్నారంటున్నారు. అంతే కాకుండా బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిథి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ ను రాష్ట్రానికి పంపింది. ఆయన నేరుగా రాజమహేంద్ర వరం వచ్చి పార్టీ నేతలతో బేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అన్నిటినీ సావధానంగా విన్న ఆయన అధిష్ఠానానికి నివేదిస్తానని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటంటే మురళీదరన్ కు సోము వీర్రాజు ముఖం చాటేయడం. అయితే సోము వీర్రాజు పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఓ లేఖ రాశారు.

అందులో ఆయన పేర్కన్న అంశాలను గమనిస్తే సోము వీర్రాజు ఆడలేక మద్దెలు ఓడు అంటున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ లేఖలో సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. అధికారంలో ఉన్న పార్టీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ సోము వీర్రాజు అధిష్ఠానానికి లేఖ రూపంలో చెప్పడాన్ని సొంత పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడి అధికార పార్టీ బీఆర్ఎస్ తో ఢీ అంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. అయినా అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇక్కడు సోము వీర్రాజు అందుకు పూర్తి బిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వల్లే రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతోందంటూ సోము వీర్రాజు అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే ఎద్దేవా చేస్తున్నాయి. విపక్షంలో ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలోనూ తెలుగుదేశం ఎన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడింది లేదు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినవేవీ ఇవ్వకయినా అందుకు మోడీనీ, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపైనే విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అడగకపోయినా మద్దతు ఇచ్చింది.  కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చింది. అటేవంటి టీడీపీ ఏపీలో బీజేపీ  ఎదగకపోవడానికి కారణం ఎలా అవుతుందని బీజేపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.

ఏపీలో ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు.  ఇలా లోపాలన్నీ తన వైపు పెట్టుకుని సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటోందనడం ఆడలేక మద్దెలు ఓడు అనడం కాకుండా మరేమిటని బీజేపీ రాష్ట్ర శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.

By
en-us Political News

  
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.