కేసీఆర్ కిట్ ప్రయోజనం అంతంత మాత్రమే.. తగ్గని సిజేరియన్లు

Publish Date:Jun 17, 2022

Advertisement

ఆరోగ్యం మ‌హాభాగ్యం అన్నారు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా వుంటే పాల‌కుల‌కూ మంచిదే. ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేకించి వ్య‌యం చేయ‌డం, ఆస్ప‌త్తులు, వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డం ప్ర‌భుత్వం చేప‌ట్ట‌వ‌ల‌సిన క‌నీస ధ‌ర్మం. గెలిపించినందుకు ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌తా స్వీక‌రించాలి. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాల‌తో సాగిపోతున్న కేసీఆర్ ప్ర‌భుత్వం నిజానికి తెలంగాణాలో ఆస్ప‌త్రుల అభివృద్ధి విష యంలో నిర్ల‌క్ష్యం చేస్తోంద‌నేది తేటతెల్ల‌మ‌యింది. తెలంగాణా ప్ర‌భుత్వం కేసీఆర్ కిట్ పేరిట బాలింత‌ల కు ఇవ్వడం గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంది.  

వాస్త‌వంలో ప‌రిస్థితులు అందుకు భిన్నంగానే  వున్నాయి. ప్ర‌భుత్వాస్ప త్రులు పేదల‌కు ఎల్ల‌పుడూ అన్ని వ‌స‌తుల‌తో అందుబాటులో వుంటాయ‌ని, ఎవ్వ‌రూ ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌వ‌ల‌సిన అవ‌స‌రం వుండ ద‌ని ప్ర‌చారం చేసుకుంది.  ఇటీవ‌ల ఒక స‌ర్వే ప్ర‌జారోగ్య విష‌యంలో దేశంలో ఏ రాష్ట్రం ఎలా వుంద‌న్న‌ది వెలుగులోకి తెచ్చింది.  అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణాలోనే సిజ‌రియ‌న్ ఆప‌రేష‌న్లు అధికంగా  జ‌రుగు తున్న సంగ‌తి తేట‌తెల్లం చేసింది.

 ప్రయివేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 98శాతం వరకు సీ సెక్షన్లే ఉండడం గమనార్హం. డెలివరీ కోసం చేసే సీ సెక్షన్‌ సర్జరీల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లే. ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణ తర్వాతి స్థానాల్లో సీ సెక్షన్‌ ఆపరేష న్లు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ద్వితీయ స్థానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తృతియస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో సీ సెక్షన్‌ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న జిల్లాల్లో కరీంనగర్‌ జిల్లా టాప్‌లో ఉంది. 300 పడకలు, ఆపై ఉన్న పెద్దస్థాయి ఆసుపత్రుల కేటగిరీలో దేశంలోనే అత్యధిక సీ సెక్షన్లు జరి గిన ఆసుపత్రుల్లో కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి 69.93శాతం ఆపరేషన్లతో దేశంలోనే రెండోస్థానంలో నిలవ డం గమనార్హం. ఇక కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరిగే సిజేరి యన్లను పరిగణనలోనికి తీసుకుంటే అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఆసుపత్రుల్లోనైనా సీ సెక్షన్‌ ఆపరేషన్లు 10శాతం దాటితే అవి తల్లి, బిడ్డ మరణాలు తగ్గించడం కోసం జరిగినవి కావని, కేవలం ధనార్జనే ధ్యేయంగా జరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేస్తోంది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం సీ సెక్షన్లు మొత్తం కాన్పుల్లో కేవలం 10శాతం, ఒక్కోసారి 15 శాతం వరకు మాత్రమే ఉండాలి. 

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా  సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని  నీతి ఆయోగ్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. కరీంనగర్‌ జిల్లా లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇప్పటికీ  90శాతం సిజేరియన్లే జరుగుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లాలో 77శాతం, మం చిర్యాల, నిర్మల్ లోనూ  90 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 62.36శాతం సీజేరియన్లు  ఈ  ఏడాదికి 79.14 శాతానికి  చేరుకున్నాయ‌ని  వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.