ఆరునెలల మంత్రి అజ‌ర్ కి మ‌రో ఆప్ష‌న్ అదేనా?

Publish Date:Apr 19, 2026

Advertisement

అజ‌రుద్దీన్ మంత్రి ప‌ద‌వి.. అంతే సంగ‌తులా?  ఆయ‌న ఎమ్మెల్సీ కాక పోవ‌డంతో  మరో నెల  రోజుల్లో త‌న మంత్రి పదవిని కోల్పోవ‌ల్సి వ‌స్తుందా? అజ‌ర్ భ‌విత‌వ్యం ఏంటి? ఒక వేళ ఆయ‌న మంత్రిత్వం కాపాడ‌లేక పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి  మొద‌ల‌వ‌దా?  తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భ‌రితంగా మారింది.  ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది.

ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం, ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే..  ఆరు నెలల లోపు అసెంబ్లీకో, మండలికో   ఎన్నికవ్వాలి. అజారుద్దీన్  అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఈ నెలాఖరు లోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అజ‌ర్ ఎమ్మెల్సీ ఎందుకు కాలేకపోయారు? ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే..  ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండ‌లికి పంపాల్సి ఉంటుంది.

ఒక వేళ ఈ ప్ర‌య‌త్నాలు వ‌ర్క‌వుట్ కాకుంటే అజ‌ర్ మంత్రి ప‌ద‌వి పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్పడుతోంది.  రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో అజారుద్దీన్ ఏకైక ముస్లిం మంత్రి. అది కూడా జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక‌ల ముందు ఆయ‌న్ను   క్యాబినేట్ లోకి తీసుకున్నారు. ఒక వేళ అజారుద్దీన్ మంత్రి ప‌ద‌విని రేవంత్ నిలపలేకపోతే.. అదంతా ఆ టైంలో అంటూ జూబ్లీ ఉపఎన్నికలో  అవ‌స‌రానికి మైనార్టీ ఓట్ల కోసం వేసిన ఎర‌గా వారు భావించే అవ‌కాశ‌ముంది.  ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు రెండేళ్ల వరకు మంత్రిమండలిలో మైనార్టీ ప్రాతినిధ్యం లేదన్న విమర్శలు ఉండ‌నే ఉన్నాయి. దాన్ని పూడ్చడానికే ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్‌ను మంత్రిని చేశారు.

ఇప్పుడు ఆయన పదవి కోల్పోతే, అది కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు విషయంలో రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎలాగైనా ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతానికి అజర్ భవితవ్యం గవర్నర్ నిర్ణయం, న్యాయపరమైన అంశాల చేతుల్లో ఉంది.  ఒకవేళ ఏప్రిల్ 30 లోపు వీలు కాకపోతే, ఆయన రాజీనామా చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ గతంలో హరికృష్ణ  విషయంలో జరిగినట్లుగా, ఒకసారి పదవి పోతే తిరిగి రావడం అంత సులభం కాకపోవచ్చు. మొత్తానికి, ఏప్రిల్ 30వ తేదీ అజారుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్‌లో ఒక క్రూషియల్ పీరియ‌డ్ లాంటిది. ఆయన ఈ గడువును దాటుతారా లేదా? అనేది వచ్చే కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.