బోర్లా పడుకునే అలవాటు మీకూ ఉందా? అయితే మీరు ఇది చదవాల్సిందే..!

Publish Date:Feb 3, 2024

Advertisement

కంటినిండా నిద్రపోతే చాలు.. అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం నిద్రపోవడమే కాదు.. ఎలా నిద్రపోతున్నాం అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రపోయే భంగిమ మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటారు. సాధారణంగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవడం ఆరోగ్యం అంటారు. ఇలా కాకుండా కుడివైపుకు తిరిగి పడుకోవడం అస్సలు మంచిది కాదని అంటారు. ఇవి రెండూ కాకుండా కొందరికి బోర్లా .. పొట్టను నేలకు ఆన్చి పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా పొట్టను  కిందుగా ఉంచి నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అసలు బోర్లా.. పొట్టను కిందకు పెట్టి పడుకోవడం వల్ల కలిగే సమస్యలేంటి? తెలుసుకుంటే..

 మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి నిద్ర విధానం భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ వీపును నిటారుగా ఉంచి నిద్రించడానికి ఇష్టపడతారు. మరికొందరు ఒక వైపు తిరిగి  నిద్రించడానికి ఇష్టపడతారు. కానీ మరికొందరు పొట్టను కిందకు వేసుకుని నిద్రపోతారు.  ఇలా పడుకోవడం సౌకర్యంగానూ, మంచి నిద్రను ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇది  హానికరం.

శరీర నొప్పి..

కడుపు కిందకు వేసుకుని  నిద్రపోవడం వల్ల శరీర నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇది మొదట్లో సౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇలా నిద్రపోవడం వల్ల  వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది, దీని కారణంగా  వెన్నునొప్పికి గురవుతారు. ఇది కాకుండా మెడ నొప్పిని కూడా కలిగిస్తుంది.

వెన్నెముకకు మంచిది కాదు..

బోర్లా పడుకోవడం  వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పెరుగుతుంది.  దీని కారణంగా భవిష్యత్తులో వెన్నెముకకు సంబంధించిన పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ భంగిమలో పడుకోవడం మానుకోవాలి.

రొమ్ము నొప్పి..

మహిళల్లో రొమ్ము నొప్పికి తరచుగా బోర్లా  నిద్రపోవడమే కారణం. ఈ భంగిమలో రొమ్ములపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.   రోజూ ఈ పద్ధతిలో నిద్రపోవడం వల్ల రొమ్ము నొప్పి ఫిర్యాదులు వస్తాయి.

 జీర్ణక్రియ తగ్గుతుంది..

బోర్లా  నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఈ స్థితిలో  జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా కడుపు నొప్పి  సమస్యలు వస్తాయి.

చర్మానికి హానికరం..

బోర్లా  పడుకున్నప్పుడు  ముఖం  దిండుపై ఉంటుంది. దీని కారణంగా దిండులో ఉండే  దుమ్ము, ధూళి,  బ్యాక్టీరియా ముఖానికి తగలడం వల్ల ముఖ చర్మానికి  హాని కలిగుతుంది.  ఇది మొటిమలు , చర్మ సంబంధ సమస్యలకు  కారణమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోవడం వల్ల  చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. దాని వల్ల చర్మం మీద తొందరగా ముడతలు వస్తాయి.

నిద్రించడానికి మంచి భంగిమ ఏది?

నిద్రపోతున్నప్పుడు  మెడ,  వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర కోసం మెత్తగా తేలికపాటి దిండ్లను ఉపయోగించాలి.   మరీ ముఖ్యంగా  ఎడమ వైపున నిద్రించడం వల్ల శరీరంలో  రక్త ప్రసరణతో ఆరోగ్యకరంగా ఉంటుంది.

                                                           *నిశ్శబ్ద.

By
en-us Political News

  
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.