సూర్యకుమార్ అవుట్.. టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్?

Publish Date:Jun 5, 2026

Advertisement

భారత టీ20 క్రికెట్ జట్టులో ఊహించని విధంగా పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను నియమించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. శనివారం జరగబోయే సెలెక్షన్ కమిటీ సమావేశంలో శ్రేయాస్ అయ్యర్ స్వయంగా పాల్గొననుండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఈ శనివారం జరిగే సెలెక్షన్ కమిటీ అత్యవసర సమావేశంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం కూడా భారత జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ పర్యటనల నుంచే శ్రేయాస్ అయ్యర్ అధికారికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2023 డిసెంబరులో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన మ్యాచ్ తర్వాత అయ్యర్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ, ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏకంగా 498 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను చాటడమే కాకుండా, తన అద్భుతమైన నాయకత్వ ప్రతిభతో బీసీసీఐ పెద్దలను మెప్పించాడు. ఈ బలమైన ప్రదర్శనే ఇప్పుడు అతడిని భారత జట్టు కెప్టెన్సీ రేసులో ముందంజలో నిలిపింది.

మరోవైపు తెలుగు క్రికెట్ అభిమానులకు కూడా ఒక తీపి కబురు అందనుంది. యంగ్ సెన్సేషన్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు భారత జట్టులో కీలక బాధ్యతలు దక్కే అవకాశముంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తిలక్ వర్మను టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించేందుకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న తిలక్‌ను భవిష్యత్ లీడర్‌గా తీర్చిదిద్దాలనేది సెలెక్టర్ల ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో అయ్యర్, తిలక్ వర్మల సరికొత్త కాంబినేషన్‌ను మనం చూసే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టును విజయవంతంగా నడిపించి, వరుసగా రెండోసారి జట్టుకు కప్ అందించి చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ పరిణామం ఊహించని పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. కెప్టెన్‌గా సూర్య సక్సెస్ అయినప్పటికీ, ప్రపంచ కప్‌ టోర్నీలో అతడి వ్యక్తిగత బ్యాటింగ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో సాగలేదు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 242 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున కేవలం 270 పరుగులకే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచాడు. అతడి పేలవ ఫామ్ కారణంగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

By
en-us Political News

  
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.