కేసీఆర్ కోసం జగన్.. జగన్ కోసం షర్మిల.. పాపం కాంగ్రెస్

Publish Date:Aug 22, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో నానాటికీ తీసికట్లు నాగంభొట్లు అన్నట్లుగా తయారౌతోంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నామ మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ ను బలోపేతం చేసే ఉద్దేశంతో అధిష్ఠానం షర్మిల అనే తురఫు ముక్కను ఉపయోగించాలని శతథా ప్రయత్నిస్తోంది. అందుకే తెలంగాణలో వైఎస్సార్టీపీ పేర సొంత కుంపటి పెట్టుకుని తన మానాన తాను నడక దారిలో సాగుతున్న షర్మిలకు కాంగ్రెస్ గాలం వేసింది.

 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ష‌ర్మిల స్థాపించారు. తానే అధ్య‌క్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో ప‌రుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.. ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయ‌కుల చేరిక‌లు, పాద‌యాత్ర‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది. మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. షర్మిల ఎంత కష్టపడినా, పాదయాత్ర, దీక్షలు, ప్రధాన రాజకీయ పార్టీలను మించి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించినా ఆ రాష్ట్ర జనం మాత్రం షర్మిలను పదె్దగా విశ్వసించినట్లు కనబడదు. సమైక్య వాది అయిన రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని తీసుకు వస్తానంటూ ఆమె తెలంగాణలో చేస్తున్న రాజకీయం ఏ మాత్రం ఆమెకు ప్రజాదరణను తీసుకువస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

సరిగ్గా ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లైంది. కర్నాటకలో సాధించగలిగినప్పుడు దేశం మొత్తం ఎందుకు సాధించలేం అనుకుంది. అలాగే ఏపీలో కూడా బలోపేతం కాగలమన్న విశ్వాసం వచ్చింది. అప్పుడే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని ఆమెకు ఏపీ పగ్గాలప్పగిస్తే తమ పని సులువు అవుతుందని భావించింది. అంతే వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కేవీపీ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకేలను రంగంలోకి దింపింది. కాగల కార్యం వారే తీరుస్తారని భావించింది. అనుకున్నట్లే  అంతా జరుగుతోందని కాంగ్రెస్ భావించింది. అంతా బానే ఉందనుకుంటున్న సమయంలో కథ మళ్లీ మొదటికి వచ్చింది.  

ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సూచనల్ని షర్మిల తిరస్కరించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.  తన రాజకీయం తెలంగాణకు మాత్రమే పరిమితమని కాంగ్రెస్ కు తేటతెల్లం చేశారని అంటున్నారు.  అయితే  షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమె తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే అది తమకు తీరని నష్టం చేస్తుందని భావించిన కాంగ్రెస్ అందుకు తిరస్కరించిందని చెబుతున్నారు. దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన ప్రతిపాదన దశలోనే ఆగిపోయిందని చెబుతున్నారు.  షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ బాధ్యతలు తీసుకుంటే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ బావిస్తోంది. మొత్తంగా షర్మిల రాజకీయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ రెడ్డి, కేసీఆర్ ల మైత్రిలో భాగంగానే షర్మిల తెలంగాణలో పని చేస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఆమె తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువ కాలాని ప్రయత్నిస్తున్నా జనం పట్టించుకోలేదు. కానీ ఆమెను అందరి కన్నా ఎక్కువగా పట్టించుకుని ఆమెకు, ఆమె పార్టీకి హైప్ ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ చేయగలిగినంతా చేసింది. చేస్తోంది. అరెస్టులు, హౌస్ అరెస్టులతో ఆమె నిత్యం వార్తలలో నిలిచేలా కేసీఆర్ సర్కార్ సహకారం అందిస్తోంది.

దీంతో ఆమె కేసీఆర్ కోసం తెలంగాణలో జగన్ బాణంగా పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నతో విబేధాల కారణంగా తెలంగాణలో పార్టీ అని షర్మిల చెప్పడంలో లాజిక్ కనిపించడం లేదనీ, నిజంగా అన్న జగన్ తో విభేదాలు ఉంటే.. ఆమె ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.