పవార్ హీరోగా పీకే  థర్డ్ ఫ్రంట్! రాహుల్ పరిస్థితి ఏంటో..? 

Publish Date:Jun 22, 2021

Advertisement

‘బీజేపీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి’ ఇదొక్కటే సింగిల్ పాయింట్ ప్రోగ్రాంగా పెట్టుకున్న, బీజేపీ ప్రత్యర్ధి పార్టీలకు, నాయకులకు, తమ వ్యూహరచనతో రాష్ట్రాల స్థాయిలో బీజేపీని మట్టికరిపిస్తున్న ప్రశాంత్ కిశోర్ సహజంగానే ఒక ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. మరోవంక, కారణాలు ఏవైనా, ప్రశాంత్ కిశోర్ కూడా, అదే కోరుకుంటున్నారు. బీజేపీని  ఓడించడం ఒక్కటే తన ముందున్న కర్తవ్యంగా ఆయన భావిస్తున్నారు. బెంగాల్ విజయం తర్వాత ఎన్నికల వ్యూహ రచన వ్యాపకం నుంచి తప్పు కుంటున్నట్లు  ప్రశాంత్ కిషోర్, ఇప్పడు మరింత విస్తృత స్థాయిలో అదే బాధ్యతను మరో రూపంలో బుజానికి ఎత్తుకున్నారు. 

ప్రస్తుత పరిస్థితిలో బెజీపీని ఓడించడం, కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీతోనూ అయ్యే పని కాదు. ఇది అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ అంగీకరిస్తున్నదే. అన్ని పార్టీలను, కనీసం ఎన్డీఎ యేతర పార్టీలను ఏకం చేస్తేనే కానీ, బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. ఇది కూడా, సో కాల్డ్ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తున్నదే. అలాగే, అన్నీ పార్టీలు ఏకం కావాలని, ఇంచుమించుగా అన్ని పార్టీలు కోరుకుంటూనే ఉన్నాయి. ఎటొచ్చి పిల్లి మెడలో గంట కట్టేదెవరు?అన్న దగ్గరే ఇంతవరకు అందరి ఆలోచనలు మిగిలి పోయాయి. గతంలో చేసిన అలాంటి ప్రయత్నాలు కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయాయి. ఈ నేపధ్యంలోనే, బీజేపీ, మోడీ పట్ల వ్యతిరేక పెరికి పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలో, పిల్లి మెడలో గంట  ప్రశ్న మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆ ప్రశ్న  చుట్టూనే ప్రాంతీయ, జాతీయ పార్టీల  నాయకులు చక్కర్లు కొడుతున్న సమయంలో, నేనున్నానంటూ ముందు కొచ్చారు, ప్రశాంత్ కిశోర్. 

ఇప్పుడు ఆయన మార్గ దర్శకత్వంలో, ది మోస్ట్ ఎలిజిబుల్ లీడర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సారధ్యంలో, జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక పక్షం  రోజుల క్రితం జూన్ 11 వతేదీన, రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, ముంబైలో శరద్ పవార్’ను కలవడంతో ఊహాగానంగా మొదలైన బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు, మళ్ళీ నిన్న ఢిల్లీలో పవార్, ప్రశాంత్ సెకండ్ రౌండ్ టాక్స్’తో మరింత కాంక్రీట్ షేప్ తీసుకుంది. ప్రశాంత్ కిషోర్, పవార్ ముంబై సమావేశం తర్వాత ఎలాంటి ప్రకటన లేదు.కానే, ఢిల్లీ రౌండ్ టాక్స్ తర్వాత ఎన్సీపీ అధికార ప్రతినిధి, నవాబ్ మాలిక్ మీడియా ముందుకొచ్చి, శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరినీ ఏకం చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారన్న శుభ వార్తను చెప్పారు.  

మంగళవారం జరుగతున్న ఎన్సీపీ కార్యవర్గ సమావేశంలో ఈ విషయమ పై మరింత లోతుగా చర్చించే అవకాశం ఉందని నవాబ్ మాలిక్ సూచనప్రాయంగా చెప్పారు. అలాగే, మంగళవారం సాయత్రం, పవార్ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు,వివిధ  పార్టీల నాయకులతో సమావేశం అవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో  తృణమూల్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఆప్ ప్రతినిధి సంజయ్ సింగ్, ఇతర పార్టీలకు చెందినా పవన్ వర్ర్మ, సంజయ్  సింగ్, డి.రాజా, ఫరూక్ అబ్దుల్లా, కొద్ది మంది మోడీ వ్యతిరేక మేథావులు, కేటీ తులసీ వంటి వారు హాజరావుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించక పోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిస్తోంది. ప్రశాంత్  కిషోర్, ‘మిషన్ 2024’ప్రచారం రాహుల్ గాంధీని అభ్యర్ధిని చేద్దామనే, ట్వీట్ తోనే ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు, కాంగ్రెస్’ను పక్కన పెట్టి, బీజేపే వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఒక వేళ ఈ సమావేశం రాహుల్ గాంధీకి మద్దతు కూడ గట్టేన్డుకోనేమో అన్న సందేహలు వినవస్తున్నాయి.  

అయితే, ప్రధానంగా బీజేపీ, మోడీని ఓడిచడం లక్ష్యంగా మొదలైన ప్రయత్నంగానే దీని చూడాలని, చివరకు ఇది ద్వితీయ ఫ్రంట్ అవుతుందా, తృతీయ ఫ్రంట్ అవుతుందా, అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమని ఎన్సీపీ నాయకుడు ఒకరు చెప్పారు. కాబటి ఫ్రంట్ ‘లో కాంగ్రెస్ రోల్ గురించి ఇప్పుడే చర్చించడం అనవసరంగాన  రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ప్రణాలిక వెనక ఉన్నది, నిన్న గాక మొన్న బెంగాల్, తమిళనాడులో మోడీ, షా ద్వయాన్ని చిత్తు చేసిన ప్రశాంత్ కిషోర్ కావడంతో, ఈ పరిణామాలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్, ఏమైనా చేయగల ఘటన ఘటన సమర్ధుడు, సో.. ఊహాగానాలు వదిలి ... జరిగే పరిణామాలను  గమనించడమే  ప్రస్తుతానికి ఉభయతారకం.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.